నేటి నుంచి కడప జిల్లాలో సీఎం జగన్ పర్యటించనున్నారు. సీఎం జగన్ నేటి నుంచి 10వ తేదీ వరకు కడపజిల్లా పర్యటనకు రానున్నారు. సీఎం జగన్ కడప జిల్లా వివరాలు ఇలా ఉన్నాయి. సీఎం జగన్ కడప టూర్ లో భాగంగా ఇవాళ మధ్యాహ్నం 1.30 గంటలకు కళ్యాణ దుర్గం నుంచి హెలికాప్టర్ ద్వారా బయలుదేరి ఇడుపులపాయకు చేరుకుంటారు.
మధ్యాహ్నం 2 గంటలకు నేరుగా వైఎస్సార్ ఘాట్ కు చేరుకొని తండ్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సమాధి వద్ద నివాళులర్పించనున్నారు.అనంతరం ఇడుపులపాయలోని ప్రార్థన మందిరానికి వెళతారు. అక్కడ సింహాద్రిపురం మండల నాయకులతో సమావేశం కానున్నారు. సాయంత్రం 5:30 గంటలకు అక్కడి నుంచి ఇడుపులపాయలోని ఇంటికి వెళ్లనున్నారు.
అయితే.. ఇవాళ వై.యస్.రాజశేఖరరెడ్డి 74వ జయంతి వేడుకలు జరుగనున్న నేపథ్యంలోనే.. సీఎం జగన్ ట్విట్టర్ లో స్పందించారు. ప్రజల జీవన ప్రమాణాలు పెరగాలని, ప్రతి ఇంట్లో గొప్ప చదువులు చదవాలని, సుఖసంతోషాలతో ప్రతి ఒక్కరూ ఉండాలని మీరు నిరంతరం తపించారు నాన్నా అంటూ ఎమోషనల్ అయ్యారు. అదే ప్రజలందరి హృదయాల్లో మీ స్థానాన్ని సుస్థిరంచేసింది. ఆ ఆశయాల సాధనలో మీ స్ఫూర్తి నన్ను ప్రతిక్షణం చేయిపట్టి నడిపిస్తోందని.. మీ జయంతి మాకందరికీ ఒక పండుగ రోజు అన్నారు సీఎం జగన్.