అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయండి – సీఎం జగన్‌

-

అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయండని సీఎం జగన్‌ ఆదేశాలు జారీ చేశారు. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమం పై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష చేశారు. ఈ సందర్బంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ.. అంగన్‌వాడీ సెంటర్లలో ఉన్న సదుపాయాల పై గ్రామ సచివాలయాల నుంచి సమాచారం తెప్పించుకోవాలి.. అంగన్‌వాడీల్లో చేపట్టాల్సిన పనుల పై ప్రతిపాదనల పై నివేదిక తయారు చేయండని తెలిపారు.

పిల్లల ఎదుగుదలను పర్యవేక్షించే గ్రోత్‌ మానిటరింగ్‌ ఎక్విప్‌మెంట్‌ లను అంగన్‌వాడీల్లో ఉంచాలని.. ఖాళీగా ఉన్న అంగన్‌వాడీ వర్కర్లు, అంగన్‌వాడీ హెల్పర్‌ పోస్టులను వెంటనే భర్తీ చేయండని ఆదేశాలు జారీ చేశారు సీఎం జగన్‌. మహిళా శిశు సంక్షేమశాఖలో ఉన్న ఖాళీలను కూడా భర్తీ చేయండన్నారు. సంపూర్ణ పోషణ కింద పంపిణీ ప్రక్రియకు సంబంధించి సమర్థవంతమైన ఎస్‌ఓపీ రూపొందించాలని ఆదేశాలు జారీ చేశారు. క్రమం తప్పకుండా అంగన్‌వాడీలపై పర్యవేక్షణ జరగాలని దిశా నిర్దేశం చేశారు జగన్‌. అంగన్‌వాడీల్లో సూపర్‌ వైజర్లపైన కూడా పర్యవేక్షణ పకడ్బందీగా ఉండాలన్నారు సీఎం జగన్‌.

Read more RELATED
Recommended to you

Latest news