ఆస్ట్రేలియా నుంచి ఏపీకి వచ్చిన వారిలో ఒకరికి కరోనా సోకినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఆస్ట్రేలియా నుంచి సింగపూర్ మీదుగా విశాఖ విమానాశ్రయం ద్వారా వచ్చిన ప్రయాణికుల నుంచి నమూనాలను సేకరించి కరోనా నిర్దారణ పరీక్షలు చేశారు. అందులో ఒకరికి పాజిటివ్ వచ్చిందని తెలిపారు. మహిళతో పాటు కుటుంబ సభ్యులకు కరోనా పరీక్షలు జరపగా.. రిపోర్టుల్లో వారికి నెగిటివ్ వచ్చినట్లు అధికారులు వెల్లడించారు.
”పాజిటివ్ వచ్చిన మహిళ విజయనగరం జిల్లా బొండపల్లి మండలంలో ఉన్నట్లు తెలిసింది. రెండు డోసుల వ్యాక్సిన్ వేసుకున్న ధ్రువ పత్రంతో ఆమె ఏపీకి వచ్చారు. ప్రస్తుతం మహిళ ఆరోగ్యం నిలకడగానే ఉంది. జిల్లా అధికారులు నిత్యం పర్యవేక్షిస్తున్నారన్నారు. ఆమె నమూనాను జీనోమ్ సీక్వెన్సీ కోసం విజయవాడ తెప్పించాం.” అని అధికారులు పేర్కొన్నారు. భారత్‌లో కరోనా ఎక్స్‌బీబీ వేరియంట్ కేసులు నమోదైన నేపథ్యంలో ముందస్తుగా అప్రమత్తమైన ఏపీ అధికారులు విదేశీ ప్రయాణికులపై నిఘా పెట్టారు. ఈ క్రమంలోనే పాజిటివ్ నిర్ధారణ అయిన మహిళ శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు.