ఏపీలో 3 రూర్బన్ మిషన్ క్లస్టర్ల అభివృద్ధి – కేంద్రమంత్రి సాథ్వి

-

ఆంధ్రప్రదేశ్ లోని అరకు లోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లను శ్యామ్ ప్రసాద్‌ ముఖర్జీ రూర్బన్‌ మిషన్‌ కింద ఎంపిక చేసినట్లు గ్రామీణాభివృద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్‌ జ్యోతి తెలిపారు. రాజ్యసభలో శ్రీ విజయసాయి రెడ్డి అడిగిన ప్రశ్నకు మంత్రి రాతపూర్వకంగా జవాబిస్తూ.. ఈ మిషన్‌ కింద 21 విభాగాలలో చేపట్టిన వివిధ ప్రాజెక్ట్‌ల గురించి వివరించారు.

గ్రామాల్లో రహదారులు, డ్రెయిన్ల నిర్మాణం, అగ్రి సర్వీసెస్‌ ప్రాసెసింగ్‌, విద్య, స్వయం సహాయక బృందాల ఏర్పాటుతో ఉపాధి కల్పన, ఆరోగ్య, వివిధ గ్రామాలను రోడ్లతో అనుసంధానం చేయడం గ్రామాలకు పైపులతో త్రాగు నీటి వసతి కల్పించడం, గ్రామీణ గృహ నిర్మాణం, ప్రజా రవాణా సౌకర్యాల కల్పన, సామాజిక మౌలిక వసతుల కల్పన, పర్యాటక ప్రోత్సాహం, గ్రామాలకు విద్యుత్‌ సౌకర్యం కల్పించి, వీధి దీపాల ఏర్పాటు వంటి ఇత్యాది ప్రాజెక్ట్‌లను అరకులోయ, ఏలూరు, రంపచోడవరం క్లస్టర్లలో చేపట్టినట్లు మంత్రి తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news