సుప్రీంకోర్టును ఆశ్రయించిన దేవినేని అవినాష్

-

తెలుగుదేశం పార్టీ కేంద్ర కార్యాలయం పై దాడి, చంద్రబాబు నివాసం పై దాడి కేసుల్లో నిందితులకు ముందస్తు బెయిల్ ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించిన సంగతి తెలిసిందే. ఈ కేసులో నిందితులైన దేవినేని అవినాష్, లేళ్ళ అప్పిరెడ్డి, నందిగం సురేష్, తలశీల రఘురామ్ లు తమను అరెస్టు చేయకుండా బెయిల్ కోరుతూ హైకోర్టును ఆశ్రయించగా.. హైకోర్టు వారి బెయిల్ పిటిషన్లను కొట్టివేసింది.

దీంతో ఇప్పటికే వైసిపి కీలక నేతలు మాజీ ఎంపీ నందిగం సురేష్, లేళ్ల అప్పిరెడ్డిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇక ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న దేవినేని అవినాష్, తలశీల రఘురాం అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఈ దాడి వ్యవహారంలో దేవినేని అవినాష్ పైనే ప్రధానంగా ఆరోపణలు ఉన్నాయి.

ఈ నేపథ్యంలో ముందస్తు బెయిల్ కోరుతూ ఆయన హైకోర్టును ఆశ్రయించగా.. బెయిల్ పిటిషన్ ని ఏపీ హైకోర్టు తిరస్కరించింది. దీంతో ఆయన సోమవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. టిడిపి కేంద్ర కార్యాలయం పై దాడి కేసులో తనకు ముందస్తు బెయిల్ మంజూరు చేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version