పాలనలో ఫెయిలైనట్లు చంద్రబాబు అంగీకరించినట్లేనా.. ?

-

’ప్రభుత్వ వైఫల్యాల నుండి ప్రజల దృష్టిరి మరలించటానికే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఫిరాయింపులను ప్రోత్సహిస్తున్నారు’ .. ఇది తాజాగా విశాఖ నేతలతో జరిపిన టెలికాన్ఫరెన్సులో చేసిన వ్యాఖ్యలు. విశాఖనగరంలో టిడిపి తరపున గెలిచిన నలుగురు ఎంఎల్ఏల్లో ఒకరైన వాసుపల్లి గణేష్ శనివారం పార్టీకి రాజీనామా చేశారు. తన కుటుంబసభ్యులు జగన్ సమక్షంలో వైసిపి కండువ కప్పుకున్నారు. ఇదే విషయమై చంద్రబాబు తర్వాత నేతలతో మాట్లాడుతూ పై వ్యాఖ్యలు చేశారు. స్వార్ధంతో ఒకరిద్దరు పార్టీని వదిలేసినా జరిగే నష్టమేమీ లేదన్నారు. పార్టీ ఫిరాయిస్తున్న వారంతా టిడిపికి ద్రోహం చేస్తున్నట్లే లెక్కంటూ పెద్ద ఉపన్యాసమే చెప్పారు. పార్టీ తరపున గెలిచిన వారు ఫిరాయించటం దుర్మార్గమంటూ నోటికొచ్చింది మాట్లాడారు.

అంతా బాగానే ఉంది కానీ 2014-19 మధ్య వైసిపి ఎంఎల్ఏలు, ఎంపిల విషయంలో చంద్రబాబు చేసిందేమిటి ? వైసీపీ నుంచి గెలిచిన 23 మంది ఎంఎల్ఏలు, ముగ్గురు ఎంపీలను ప్రలోభాలకు గురిచేసి టిడిపిలోకి లాక్కోలేదా ? ఫిరాయింపులపై ఇపుడు చెబుతున్న నీతిపాఠాలు ఆరోజు ఎందుకు గుర్తులేదో ?  ప్రభుత్వ వైఫల్యాను కప్పిపుచ్చుకోవటానికే ఫిరాయింపులు మొదలుపెట్టినట్లు చేసిన ఆరపణ కూడా ఆశ్చర్యంగా ఉంది. అంటే ఇపుడు చంద్రబాబు చెప్పింది నిజమే అయితే మరప్పుడు పాలనలో తాను ఫెయిలైనట్లు చంద్రబాబు  అంగీకరిస్తున్నట్లే కదా… ?

ప్రతిపక్షం ఎంఎల్ఏలను చేర్చుకునే విషయంలో అసెంబ్లీ చెప్పిన నీతిశూక్తులు ఏమైందటు ప్రశ్నించటంలో కూడా అర్ధంలేదు. ఎందుకంటే టిడిపికి రాజీనామా చేసిన నలుగురు ఎంఎల్ఏలు వైసీపీలో చేరలేదు. అసెంబ్లీలో తమకు ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని మాత్రమే అడిగారు. టిడిపి హయాంలో చంద్రబాబు వ్యక్తిగతంగా పార్టీ ఫిరాయింపులను ప్రోత్సహించారు. ప్రలోభాలకు గురిచేసి మరీ ఎంఎల్ఏలు, ఎంపిలను లాక్కున్నారు. ఫిరాయించిన ఎంఎల్ఏల్లో నలుగురికి మంత్రిపదవులను కూడా కట్టబెట్టారు. కానీ ఇఫుడు జగన్ ఆ పని చేయటం లేదు.

నలుగురు ఎంఎల్ఏలు కూడా టిడిపికి రాజీనామాలు చేశారు కానీ ఒక్కళ్ళు కూడా వైసిపిలో చేరలేదన్న విషయం గుర్తుంచుకోవాలి. నలుగురిలో ముగ్గురు టిడిపి ఎంఎల్ఏలు అసెంబ్లీలో తాము టిడిపి సభ్యులతో కలిసి కూర్చునే పరిస్ధితి లేదు కాబట్టి ప్రత్యేకంగా సీట్లు కేటాయించాలని అడిగారే కానీ తమను వైసిపి సభ్యులుగా పరిగణించమని అడగలేదు. కాబట్టి చంద్రబాబు చేస్తున్న ఆరోపణలు జగన్ కు వర్తించవు. పైగా తాజాగా చేసిన వ్యాఖ్యలతో తన ఫెయిల్యూర్లను తానే చంద్రబాబు బయటపెట్టుకున్నట్లయ్యింది.

అప్పట్లో అవసరం లేకపోయినా రాజకీయంగా జగన్ను దెబ్బకొట్టాలన్న ఏకైక లక్ష్యంతో చంద్రబాబు పావులు కదిపారు. కానీ తన ప్రయత్నంలో ఫెయిలయ్యారు. అదే ప్రయత్నాన్ని ఇపుడు జగన్ కొద్దిపాటి తేడాలతో అమలు చేస్తున్నారు. మరి ఇంతోటిదానికి చంద్రబాబు ఎందుకింతగా గోల చేస్తున్నట్లు ?

-Vuyyuru Subhash 

Read more RELATED
Recommended to you

Latest news