ప్రస్తుత రాజకీయాలపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు. నేడు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో పాల్గొన్న వెంకయ్య నాయుడు మాట్లాడుతూ.. ప్రస్తుత రోజులలో ప్రజలకు రాజకీయాల పట్ల ఆసక్తి తగ్గిపోతుంది అన్నారు. రాజకీయాల స్థాయి నానాటికి దిగజారుతుందని.. రాజకీయాల స్థాయి పెంచాలంటే మంచివారిని ఎన్నుకోవాలి అన్నారు.
ఎన్నికలలో బూతులు మాట్లాడే వారిని ఎన్నుకోవద్దని ప్రజలకు సూచించారు. బూతులు మాట్లాడే నాయకులకు ప్రజలు ఎన్నికల బూతుల్లోనే ఓటు ద్వారా సమాధానం చెప్పాలన్నారు వెంకయ్య నాయుడు. తాను రాజకీయాలకు పదవి విరమణ పొందాను కానీ.. పెదవి విరమణ చేయలేదంటూ తన వ్యాఖ్యలని సమర్ధించుకున్నారు. దీంతో ఇప్పుడు వెంకయ్య వ్యాఖ్యలపై చర్చ జరుగుతుంది.