ఏపీలో స్కూళ్ల‌కు వేస‌వి సెల‌వులు పొడ‌గింపు.. ప్ర‌భుత్వం కీల‌క నిర్ణ‌యం

ఏపీలో రోజురోజుకూ క‌రోనా విల‌య తాండ‌వం చేస్తోంది. క‌ర్ఫ్యూ ఆంక్ష‌లు ఉన్న‌ప్ప‌టికీ కేసులు పెద్ద‌గా త‌గ్గుముఖం ప‌ట్ట‌ట్లేదు. అయితే ఇప్ప‌టికే స్కూళ్లుకు సెల‌వులు ప్ర‌క‌టించిన ఏపీ సీఎం జ‌గ‌న్ ప్ర‌భుత్వం.. స్టూడెంట్ల‌కు ఆన్‌లైన్ క్లాసులు నిర్వ‌హించింది. క్లాసుల నిర్వ‌హ‌ణ త‌ర్వాత ఇప్పుడు వేస‌వి సెల‌వులు న‌డుస్తున్నాయి.

అయితే ఇప్పుడు సీఎం జ‌గ‌న్ కీల‌క నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో లాక్‌డౌన్‌ కొనసాగుతున్న నేపథ్యంలో అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ స్కూళ్ల‌కు సెలవులను పొడిగిస్తున్నట్లు ఏపీ ప్రభుత్వం ప్రకటించింది.

ఈ మేరకు పాఠశాల విద్యా కమిషనర్‌ చిన వీరభద్రుడు ఉత్తర్వులను జారీ చేశారు. ఇదివ‌ర‌కే ఉన్న వేస‌వి సెల‌వులు ఈ ఏడాది జూన్ 3తో ముగుస్తున్నాయి. కానీ రాష్ట్రంలో కేసులు ఏ మాత్రం త‌గ్గ‌క‌పోవ‌డంతో కరోనా వ్యాప్తిని దృష్టిలో ఉంచుకుని స్టూడెంట్ల‌కు పరీక్షలు నిర్వహించకుండానే మరోమారు సెలవులను పొడిగించింది ప్ర‌భుత్వం. జూన్ 30 తర్వాత ప‌రిస్థితిని బ‌ట్టి సెలవులు పొడిగింపుపై నిర్ణయానికి వస్తామని ప్ర‌భుత్వం స్ప‌ష్టం చేసింది.