కొడాలి నాని కి సవాల్ విసిరిన మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు

-

వైసిపి నేత, గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని కి సవాల్ విసిరారు టిడిపి నేత, మాజీ ఎమ్మెల్యే రావి వెంకటేశ్వరరావు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ కొడాలి నాని పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. కొడాలి నాని బతుక్కి చంద్రబాబు, లోకేష్ కావాలా.. దమ్ముంటే తనపై పోటీ చేసి గెలవాలని ఛాలెంజ్ విసిరారు. ఇటువంటి నాయకులను ఎన్నుకొని ఇదేం కర్మ అని ప్రజలు అనుకుంటున్నారని అన్నారు.

గుడివాడలో టిడిపి తరఫున చంద్రబాబు, లోకేష్ వచ్చి పోటీ చేసిన ఓడిస్తానని కొడాలి నాని ధీమా వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. అయితే కొడాలి నాని కి ఇటీవల కిడ్నీ ఆపరేషన్ తో పాటు బ్రెయిన్ సర్జరీ కూడా అయినట్లు ఉందని ఎద్దేవా చేశారు రావి వెంకటేశ్వరరావు. అవినీతి, అక్రమాలతో సంపాదించిన సొమ్మును విచ్చలవిడిగా వెదజల్లిన 2024 లో కొడాలి నాని గెలవలేడని జోష్యం చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news