2017 లో లాలాపేట పరిధిలోని నల్ల చెరువులో గర్భం దాల్చిన యువతి ఆత్మహత్య కేసులో తండ్రే హంతకుడని రుజువు కావడంతో న్యాయస్థానం సంచలన తీర్పును వెల్లడించింది. గుంటూరు జిల్లా లాలాపేట పరిధిలోని మహంకాళి నాగరాజు అనే వ్యక్తి తన కుటుంబంతో సహా నివసిస్తున్నాడు. అతనికి ఒక కూతురు ఉంది. ఆమెపై కొన్ని నెలల క్రితం ఈ కీచకుడు అత్యాచారానికి పాల్పడ్డాడు. దీంతో కూతురు గర్భం దాల్చింది.
ఈ విషయం బయట పడడంతో ఆమెకి అబార్షన్ చేయించాడు. తండ్రి అరాచకాలను తట్టుకోలేక యువతి ఎదురు తిరగడంతో ఆమెపై దాడి చేశాడు నాగరాజు. ఇక ఈ బాధలు భరించలేక యువతి ఆత్మహత్య చేసుకుని మృతి చెందింది. కూతురుకి మతిస్థిమితం లేదని కోర్టును నమ్మించాడు నాగరాజు. నాగరాజ్ పై అనుమానం వచ్చిన కోర్టు మృతురాలి గర్భంలోని పిండాన్ని డిఎన్ఏ టెస్ట్ చేసి చూడగా అసలు గుట్టు బయటపడింది. దీనిపై కోర్టు సీరియస్ అయింది. నాగరాజు చనిపోయేంతవరకు జైల్లోనే ఉంచాలని న్యాయమూర్తి సీతారామకృష్ణ తీర్పు ఇచ్చారు.