ఏపీ పరిశ్రమలకు సీఎం జగన్‌ శుభవార్త..

పరిశ్రమల శాఖపై సీఎం వైయస్‌.జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మాట్లాడుతూ… పరిశ్రమల కోసం కేటాయించిన భూముల్లో మౌలిక సదుపాయాల అభివృద్ధి పై ప్రత్యేక దృష్టి పెట్టాలని… ఎంఎస్‌ఎంఈల పై ప్రత్యేక దృష్టి పెట్టాలని పేర్కొన్నారు. ఏటా క్రమం తప్పకుండా ఎంఎస్‌ఎంఈలకు ప్రోత్సాహకాలు ఇవ్వాలని.. ఇండస్ట్రియల్‌ పార్కుల్లో కాలుష్య నివారణ… పారిశ్రామిక వాడల్లో కాలుష్యాన్ని నివారించే వ్యవస్థలను పరిశీలించాలని తెలిపారు.

cm jagan
cm jagan

ప్రస్తుతం ఉన్న టెక్నాలజీకి తగిన స్థాయిలో ఉన్నాయా? లేవా? చూడాలని.. పారిశ్రామిక వాడల్లో కాలుష్య నివారణ వ్యవస్థల బలోపేతానికి ప్రత్యేక నిధి అని పేర్కొన్నారు. సంబంధిత యూనిట్లకు ప్రభుత్వం నుంచి కొంత సహాయం చేసే రీతిలో విధానాన్ని తీసుకురావాలని తెలిపారు. పంప్డ్‌ స్టోరేజీ పవర్‌ ద్వారా వాల్యూ అడిషన్‌ చేస్తున్నామని.. గ్రీన్‌ హైడ్రోజన్, అమ్మోనియా తయారీలపై దృష్టి పెట్టామని వివరించారు. గ్రీన్‌ఎనర్జీ రంగంలో ముందడుగు వేస్తామని.. గ్రీన్‌ ఎనర్జీకి సంబంధించి కూడా పాలసీలు తయారుచేయాలని తెలిపారు.