సాక్షర భారత్ మిషన్ కోఆర్డినేటర్లకు ఏపీ సర్కార్ శుభవార్త

సాక్షర భారత్ మిషన్ కోఆర్డినేటర్లకు శుభవార్త చెప్పింది జగన్‌ మోహన్ రెడ్డి సర్కార్‌. 2018 లో టీడీపీ ప్రభుత్వం తొలగించిన 502 మంది ఉద్యోగులను పునర్నియమించేందుకు అంగీకారం తెలిపారు ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి జగన్ మోహన్‌ రెడ్డి. సాక్షర భారత్ మిషన్ కింద మండలానికి ఒక కోఆర్డినేటర్ ఏర్పాటు చేశారు. అయితే 2018 మార్చిలో వీరిని ఉద్యోగంలో నుంచి తొలగించింది అప్పటి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం.

అయితే.. ఎన్నికల సమయంలో చేసిన పాద యాత్ర లో వారికి హామీ ఇచ్చారు జగన్. ఇక ఇచ్చిన హామీ మేరకు 502 మందిని స్వచ్ఛ భారత్ కార్య క్రమంలో ఔట్‌ సోర్సింగ్ పద్ధతిలో నియామకానికి పచ్చజెండా ఊపారు సీఎం జగన్. ఇక జగన్‌ మోహన్‌ రెడ్డి తీసుకున్న ఈ నిర్ణయంపై ఛైర్మన్ ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ వెంకట రామిరెడ్డి స్పందించారు. 502 మంది ఉద్యోగుల జీవితాల్లో వెలుగులు నింపిన ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు అని.. ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి జగన్ నిలబెట్టుకున్నారని కొనియాడారు.