పవన్ కల్యాణ్‌ది కాపు జనసేన కాదు.. కమ్మ జనసేన అని మంత్రి అమర్నాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కాపులెవరూ పవన్ కల్యాణ్‌ను నమ్మడంలేదన్నారు మంత్రి అమర్నాథ్. పవన్ కళ్యాణ్ బీజేపీతో కలిసి ఉన్నాడో లేదో చెప్పాలని డిమాండ్ చేశారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో కాపులెవరూ పవన్ కళ్యాణ్‌ను నమ్మటం లేదు.. జనసేన స్క్రిప్ట్, ప్రొడక్షన్ చంద్రబాబుదని… డైరెక్షన్ పక్కన ఉండే నాదెండ్ల మనోహర్‌ది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
ఇక్కడే స్పష్టంగా తెలుస్తుంది కదా కమ్మ జనసేన అని చురకలు అంటించారు. లోకేష్ చాలా అమాయకంగా మాట్లాడుతున్నాడని.. వెయ్యి కోట్ల పెట్టుబడితో ఉన్న పరిశ్రమలు ప్రారంభించటానికి తన తండ్రికి టైం ఉండేది కాదని లోకేష్ అంటున్నాడని ఫైర్ అయ్యారు. బాడీ లాస్ కోసం ప్రయత్నించి లోకేష్ కు మైండ్ లాస్ అయ్యినట్టు ఉంది.. అన్ని పరిశ్రమలు వచ్చి ఉంటే ఆ జాబితా రిలీజ్ చేయొచ్చు కదా ? అని నిలదీశారు.
భారతమ్మ గురించి లోకేష్ ఎందుకు ప్రస్తావిస్తున్నాడు?? రాజకీయాల్లో లేని భారతమ్మ గురించి మాట్లాడితే మర్యాదగా ఉండదని పేర్కొన్నారు. నీకు, బ్రాహ్మణీకి ఏదైనా సమస్యలు ఉంటే మీరు ఇంట్లో తేల్చుకోండి.. అంతేకాని మా చేత బ్రాహ్మణీని తిట్టించాలని ఎందుకు ప్రయత్నిస్తున్నావ్?? అని నిప్పులు చెరిగారు. బీచ్‌లో మందు తాగుతూ అమ్మాయిలతో తిరిగే చదువులు, సంస్కృతి మాకు లేవని తెలిపారు.