పార్లమెంట్ ప్రారంభోత్సవంను బాయ్ కట్ చేసే పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయ్ – GVL

-

పార్లమెంట్ ప్రారంభోత్సవంను బాయ్ కట్ చేసే పార్టీలు చరిత్రహీనులుగా మిగిలిపోతాయని MP GVL ఫైర్‌ అయ్యారు. రెవెన్యూ డెఫిషీట్ గ్రాంట్ ద్వారా 10 వేల 400 కోట్లు ఇచ్చి ఏపీ మీద తనకు ఉన్న అభిమానాన్ని మోడీ చాటుకున్నారు..కేంద్రం నిధులు ఇస్తే ఎందుకు అని అడగడం విడ్డురంగా విచిత్రంగా ఉందని వెల్లడించారు.


ప్రభుత్వానికి నిధులు ఇవ్వడం అంటే ప్రజా సంక్షేమం కోసమే తప్ప అనవసర నిందలు వేయడం సరైనది కాదు.. రాజకీయ ప్రయోజనాలు ఆశించి రాష్ట్ర ప్రభుత్వాన్నీ రోడ్డున పడేయాలనే అభిప్రాయంతో మాట్లాడటం సరైన విధానం కాదని ఆగ్రహించారు.

ఆంధ్ర ప్రదేశ్‌ రాష్ట్ర ప్రజలకు నిధులు ఇస్తే లాభాపేక్ష ఆశించి చేస్తున్నారని నిందలు వేయడం దారుణం…స్పెషల్ స్టేటస్ వల్ల ఎంత ప్రయోజనం చేకూరుతుందో అంత కంటే ఎక్కువ వచ్చాయని వెల్లడించారు జీవీఎల్‌. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కి కేంద్రం ఎక్కువ ప్రాధాన్యత ఇస్తోంది…నెరేగా కింద దేశంలోనే అత్యధికంగా 55వేల కోట్లు తీసుకున్న రెండో రాష్ట్రం ఏపీ అని చురకలు అంటించారు MP GVL.

 

Read more RELATED
Recommended to you

Exit mobile version