నెల్లూరులోని టీడీపీ జిల్లా కార్యాలయంలో టీడీపీ ప్రజాప్రతినిధులు, పార్టీ నేతలు, కార్యకర్తలు అలాగే జన సేన నేత టిడ్కో చైర్మన్ అజయ్ కుమార్ లతో మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎన్ఎండి ఫరూక్ లు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఇందులో భాగంగా మంత్రి ఆనం మాట్లాడుతూ.. నీటి సంఘాల ఎన్నికల పై పార్టీ అంతర్గత చర్చలో నిర్ణయాలు తీసుకున్నాం. నిర్ణయాలను స్టేట్ స్టీరింగ్ కమిటీ దృష్టిలో పెడతాం. ఎన్నికల లోపు స్టేట్ స్టీరింగ్ కమిటీ నిర్ణయాలు రాకపోతే సార్వత్రిక ఎన్నికల కో- ఆర్డినేషన్ ప్రకారమే వెళ్తాము. ప్రైమరీ అగ్రికల్చర్, మార్కెటింగ్.. దేవస్థాన కమిటీలకు ప్రణాళిక బద్దంగా కమిటీల నియామకం ఉంటుంది. కూటమి నాయకులతో కలిసి సమన్వయంతో పని చేస్తాం అని పేర్కొన్నారు.
ఇక జిల్లా ఇంచార్జి ఫరూక్ మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీ కార్యక్రమాలు, పార్టీ అభివృద్ధి పై చర్చించాము. కృష్ణపట్నం పోర్టులో నిలిచిపోయిన కంటైనర్ టెర్మినల్. కార్యకలాపాల పై చర్చించాం. జిల్లాలో కూటమి నాయకులకు పదవుల పంపకాల పై విస్తృతంగా చర్చించాం. జిల్లాలో జల వనరుల శాఖకు సంబంధించిన సమస్యలు ఉన్నాయి. వాటిని పరిష్కరించేందుకు కృషి చేస్తాం. జలాశయాల్లోని నీటిని పొదుపుగా వినియోగించుకుంటే రెండో పంటకు కూడా ఇబ్బంది ఉండదు అని పేర్కొన్నారు.