టైం మిషన్ ఉండి ఉంటే… చంద్రబాబుకు సువర్ణావకాశమే!

-

విభజిత ఆంధ్రప్రదేశ్ సమయంలో.. మరో పదేళ్లలో హైదరాబాద్ పై హక్కు కూడా కోల్పోతోన్న దశల్లో.. ఏపీవాసులు చంద్రబాబుపై గంపెడు ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు గురించి తెలిసినా కూడా… సీనియర్ అనే నమ్మకంతో, మారి ఉంటారనే ఆశతో అందలం ఎక్కించారు! చంద్రబాబు అడిగారని మూడు పంటలు పండే భూములను రైతులు రాజధానికోసం ఇచ్చారు. కానీ బాబు ఆ సువర్ణావకాశాన్ని చేజేతులా పాడుచేసుకున్నారు!

ఒక్కసారి టైం మిషన్ దొరికితే చంద్రబాబు కచ్చితంగా వెనక్కి వెళ్లే అవకాశం దక్కితే… 2014 ఎన్నికల ఫలితాల అనంతర సమయానికే వెళ్తారు అని అంటున్నారు విశ్లేషకులు. నిజంగా ఏపీవాసులు చంద్రబాబుపై అంత నమ్మకం పెట్టుకున్నారు. కానీ చంద్రబాబు తప్పులమీద తప్పులు చేసుకుంటూపోయారు. ఇక జన్మంతా తానే ముఖ్యమంత్రి అన్న రేంజ్ లో ఫిక్సయ్యారు.. జగన్ ని తక్కువంచనా వేశారు.. ప్రజలను మరింత తక్కువ అంచనా వేశారు.. ఫలితం 23 దగ్గర ఆగింది!

జగన్ ఈ రేంజ్లో ఎన్నికల సమయంలోనూ.. సీఎం అయిన తర్వాతా ఇలా పరిపాలిస్తారని.. ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటారని బాబుకు ఆఖరికి పగటి కల వచ్చినా కూడా.. నేడు టీడీపీ పరిస్థితి ఇలా ఉండేది కాదు! గ్రాఫిక్స్ కోసం కోట్లు తగలెయ్యకుండా.. విలువైన సమయాన్ని విదేశీయాత్రలకోసం వృథా చేయకుండా.. అమరావతిని ఆ ఐదేళ్లలో మార్చడానికి వీలులేనంతగా కట్టి ఉండేవారేమో!! కానీ… ఇప్పుడు బాబు గతం తలచుకుని పశ్చాత్తాపడినా ప్రయోజనం లేదు.. సరికదా, ఇప్పటిలో కనిపించడంలేదు కూడా!!

అందుకే బాబు ఇప్పుడు టైం మిషన్ ఉండి ఉంటే బాగుండేది అని ఫీలవుతున్నారంట. తన నిర్లక్ష్యం.. నాటి నేతల అత్యుత్సాహం.. చినబాబు అజ్ఞానం.. జన్మభూమి కమిటీల పనితనం.. అన్ని చక్కబెట్టుకునేవారినని భావిస్తున్నారంట!! అంటూ నెటిజన్లు ఆన్ లైన్ లో హల్ చల్ చేస్తున్నారు!!

Read more RELATED
Recommended to you

Latest news