రాజకీయాల్లో ఎప్పుడు అవకాశం వస్తే.. అప్పుడు దానికి అనుగుణంగా వ్యూహ రచనచేయడం పార్టీలకు స హజంగా ఉండే అలవాటు. అయితే, ఈ వ్యూహాలు ఒక్కొక్కసారి బెడిసి కొట్టినా కొట్టొచ్చు! ఇప్పుడు ఇలాంటి వ్యూహ రచనకే టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు ప్రాధాన్యం ఇచ్చారని అంటున్నారు పరిశీలకు లు. రాష్ట్రంలో గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీకంచుకోటలు కుప్పకూలిన విషయం తెలిసిందే. టీడీ పీకి కొన్ని దశాబ్దాలుగా అనుకూలంగా ఉన్న నియోజకవర్గాల్లోనూ వైసీపీ పాగా వేసింది. దీంతో చంద్రబాబు ఆయా నియోజకవర్గాల్లో పార్టీని నిలబెట్టేందుకు తీవ్రంగా యత్నిస్తున్నారు.
అయితే, ఆయనకు క్షేత్రస్థాయిలో తమ్ముళ్లు కొందరు సహకరిస్తున్నారు.. మరికొందరు సహకరించడం లే దు. ఇదిలావుంటే, తమకు పట్టున్న నియోజకవర్గాలను కోల్పోయిన దరిమిలా.. తాము ఇప్పుడు పట్టు పెం చుకునేందుకు అవకాశం లేకపోతే.. కనుక.. ఇక్కడ గెలిచిన వైసీపీని జీరో చేయడం ద్వారా తాము అను కున్నది సాధించవొచ్చని బాబు భావిస్తున్నట్టు విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే.. తమ పార్టీకి ఊపు రాదని గ్రహించిన చోట .. వైసీపీ ఎమ్మెల్యేను ప్రజలే చీదరించుకునేలా చేయడం బాబు వ్యూహంలో కీలక భాగమని అంటున్నారు పరిశీలకులు.
ఈక్రమంలోనే తమకు పట్టున్న శ్రీకాళహస్తిలో వైసీపీ పాగా వేయడాన్ని జీర్ణించుకోలేక పోతున్న చంద్రబా బు.. ఇక్కడ నుంచి గెలిచిన వైసీపీ నాయకుడు బియ్యపు మధుసూదన్‌రెడ్డిని ప్రజల్లో విమర్శల పాలు చేయడం, ఆయనపై ప్రజలు ఏవగించుకునేలా చేయడం అనే రెండు లక్ష్యాలతోనూ బాబు ముందుకు సాగుతున్నారని అంటున్నారు. ఈ క్రమంలోనే శ్రీకాళహస్తిలో మధును డీ గ్రేడ్ చేసేందుకు అక్కడ కరోనా వ్యాప్తికి ఆయనే కారణమంటూ తన అనుకూల మీడియాతో పాటు .. పార్టీ తరఫున కూడా తన వారితో ప్రచారం చేయిస్తున్నారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
నిజానికి మధు చేసిన దానిలో తప్పులేదని పోలీసు, రెవెన్యూ యంత్రాంగం కూడా అభిప్రాయపడుతోంది. ప్రభుత్వం కూడా ఇంటిలిజెన్స్ నివేదిక తెప్పించుకుంది. దీనిలోనూ మధు తప్పులేదని తేలింది. అయినా కూడా చంద్రబాబు ఇలా యాగీ చేయడం, కీలక నాయకులను తెరవెనుక ఉండి ప్రోత్సహించడం వంటివి గమనిస్తే.. మొత్తానికి వైసీపీని డైల్యూట్ చేయడంలో భాగమే తప్ప ఈ విషయంలో బాబు సాధించేది ఏమీ ఉండదని చెబుతున్నారు.