వైకాపాలో అ”ద్వితీయ” శక్తిపై పెరుగుతున్న ఆరోపణలు?

జల్సా సినిమాలో సరుకులు తెచ్చాక… బ్రహ్మానందాన్ని చిల్లర అడుగుతాడు పవన్. ఉంచుకోమన్నారు కదా సర్ అంటాడు బ్రహ్మి. అంటారా… అది నా దయాగుణం. కానీ నువ్వు తిరిగి ఇచ్చెయ్యాలి.. అది నీ సంస్కారం అంటాడు పవన్! ఈ ఉపోధ్గాతం అంతా ఎందుకంటారా… “చనువు ఇవ్వడం ఆయన దయాగుణం… ఆది కాపాడుకోవడం ఈయన సంస్కారం” అవ్వాలి అంటూన్నారు వైకాపాలో కొందరు నేతలు! ఇప్పటికే అర్ధం అయిపోయి ఉంటుంది.. మేటర్ ఏమిటనేది!!


అవును… వైకాపాలో ఇప్పుడు జగన్ కు సాయిరెడ్డి వ్యవహారం కూడా చెప్పుకోలేని తలనొప్పిగా మారిందని అంటున్నారు కొంతమంది నేతలు! ఎప్పుడో రాజశేఖర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవ్వడం కంంటే ముందునుంచే జగన్ కు సాయిరెడ్డి పరిచయం ఉందని.. జగన్ ఎన్నో విషయాల్లో సాయిరెడ్డిని నమ్మారని, అలాగే సాయిరెడ్డి కూడా ఆ నమ్మకాన్ని కాపాడుకుంటూ జగన్ కు తోడున్నాడని అంటుంటారు. అంతవరకూ బాగానే ఉంది.. అది స్నేహం అనుకోవచ్చు!! లేదా మరేదైనా అనుకోవచ్చు! అంతవరకూ బాగానే ఉంది.. అనంతరం పార్టీ పెట్టిన కొత్తల్లోనూ, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా జగన్ కు విజయసాయి రైట్ హ్యాండ్ గా పనిచేశారని అంటుంటారు. అదీ బాగానే ఉంది.

అధికారంలోకి వచ్చాక కూడా పార్టీ విషయంలో సాయిరెడ్డికి, జగన్ కీలక పాత్రలే ఇచ్చారని అంటుంటారు.. సాయిరెడ్డి కూడా ఆ కృతజ్ఞత ఎక్కడా తగ్గకుండానే పనిచేస్తుంటారని అంటుంటారు. అదీ బాగానే ఉంది కానీ… గత కొన్ని రోజులుగా సాయిరెడ్డి మంత్రుల విషయల్లో కూడా కలగజేసుకుంటున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. అది ప్రభుత్వం వ్యవహారం కాబట్టి… జగన్ కూడా కాస్త ఇబ్బంది పడుతున్నారని అంటున్నారు.

జగన్ ఎలాగూ గట్టిగా మాట్లాడరు కాబట్టి ఆ బాధ్యత తాను తీసుకుంటున్నానని ఆయన భావించి ఉండవచ్చు.. అలాగే ఇంతకాలం విశ్వాసంగా ఉన్న వ్యక్తిని పుసుక్కున ఒక మాట అనలేక జగన్ చాలా ఇబ్బంది పడుతుండోచ్చు! దీంతో… ఇది సాయిరెడ్డే అర్ధం చేసుకుని కాస్త తగ్గితే జగన్ కి ప్రశాంత కలిగించిన వారవుతారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఈ సందర్భంలోనే… “చనువు ఇవ్వడం జగన్ గొప్పతనం.. అది కాపాడుకోవడం సంస్కారం… అది సాయిరెడ్డికి ఇప్పుడు చాలా అవసరం” అంటున్నారు!!

ఇదే క్రమంలో… విజయసాయి రెడ్డి అనే వ్యక్తి జగన్ కి ఎప్పుడూ బలం కావాలి కానీ.. బలహీనత కాకూడదని వీరిద్దరి ఉమ్మడి అభిమానులూ కోరుకుంటున్నారు!