తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. తిరుమల వైకుంఠం క్యూ కాంప్లేక్స్ లోని కంపార్టుమెంట్లలని పూర్తిగా నిండిపోయ్యి వెలుపల క్యూ లైనులో వేచివున్నారు భక్తులు. ఈ తరునంలోనే.. టోకేన్ లేని భక్తులకు తిరుమల శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటల సమయం పడుతోంది. దీంతో 86859 మంది భక్తులు..నిన్న శ్రీవారిని దర్శించుకున్నారు.
37173 మంది భక్తులు…తలనీలాలు సమర్పించారు. అటు గడిచిన 24 గంటలలో..తిరుమల శ్రీవారి హుండి ఆదాయం 3.64 కోట్లుగా నమోదు అయింది. ఇక అటు ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి. కొండపైకి వాహనాలకు నో ఎంట్రీ ప్రకటించారు అధికారులు. తిరుమలలో బ్రహ్మోత్సవాలు సందర్భంగా రేపు గరుడ వాహన సేవ ఉంటుంది. దీంతో ఇవాళ్టి నుంచే తిరుమలలో ట్రాఫిక్ ఆంక్షలు కొనసాగనున్నాయి.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ప్రవైట్ ట్యాక్సిలకు ఘాట్ రోడ్డులో అనుమతి ఇవ్వడం లేదు అధికారులు. ఇవాళ రాత్రి 9 గంటల నుంచి ఎల్లుండి ఉదయం 9 గంటల వరకు ఘాట్ రోడ్డులో ద్విచక్రవాహానాలకు అనుమతి నిలిపివేస్తున్నారు. అటు రేపు 24 గంటల పాటు ఘాట్ రోడ్డులు, నడకమార్గం తెరిచి వుంచనున్నారు టిటిడి అధికారులు.