శ్రీదేవికి టికెట్ ఇవ్వనని జగన్ ఎప్పుడో చెప్పారు – డిప్యూటీ సీఎం నారాయణ

ఎన్టీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరిగిన ఆసరా మూడవ విడత కార్యాక్రమంలో పాల్గొన్నారు డిప్యూటీ సిఎం నారాయణ స్వామి, ఎమ్మెల్యేలు మల్లాది విష్ణు, వెల్లంపల్లి శ్రీనివాస్, కలెక్టర్ ఢిల్లీ రావు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం నారాయణ స్వామి మాట్లాడుతూ.. డబ్బుకు ఆశపడే ఆ నలుగురు ఎమ్మెల్యేలు క్రాస్ ఓటింగ్ కి పాల్పడ్డారని అన్నారు.

శ్రీదేవి కి ఇంకేమైనా ఇస్తా కానీ టికెట్ ఇవ్వను అని జగన్ ఎప్పుడో చెప్పారని తెలిపారు. చంద్రబాబు తాను క్లాస్మేట్ లమే అయినప్పటికీ రాజకీయంగా వేరు అని స్పష్టం చేశారు. సీఎం జగన్ అమ్మ ఒడి పెట్టినపుడే తన ఉంగరంలో జగన్ ఫోటో పెట్టుకున్నానని తెలిపారు నారాయణస్వామి. ఇంక మా పార్టీలో డబ్బుకు ఆశపడి పోయే వాళ్ళు ఎవరూ లేరని తెలిపారు. గ్రాడ్యుయేట్ లకు చంద్రబాబు ఏం చేసాడని ప్రశ్నించారు.

గ్రాడ్యుయేట్ లు అందరూ మా వాళ్ళేనన్నారు. జగన్ ను కాదని వెళ్ళిన వాళ్ళు జీరో అయ్యారని… చంద్రబాబు కూడా జీరో అయ్యాడని అన్నారు. సీఎం జగన్ కుల వ్యవస్థ, మత వ్యవస్థ లేకుండా పేదవ్యవస్థ తీసుకు వస్తున్నారని అన్నారు. కలెక్టర్లు పని చేస్తేనే ప్రజలకు అన్ని పధకాలు చేరతాయన్నారు. 32వేల గ్రూపులకు 280 కోట్లు ఎన్టీఆర్ జిల్లాలో విడుదల చేసారని వివరించారు.