జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది – నారా లోకేష్

జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరిందని మండిపడ్డారు తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్. మహనీయులను అవమానించి రాక్షస ఆనందం పొందుతున్నారని ట్విటర్ వేదికగా ఘాటు వ్యాఖ్యలు చేశారు. “జగన్ రెడ్డి పేర్ల మార్పు పిచ్చి పరాకాష్టకు చేరింది. మహనీయులను అవమానించి రాక్షస ఆనందం పొందుతున్నారు. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్చి పెద్ద తప్పు చేసారు.

నేడు విజయనగరంలో ఉన్న మహారాజ ప్రభుత్వాసుపత్రి పేరు మార్చి ప్రజల మనోభావాలను దెబ్బతీశారు. నగరం నడిబొడ్డున విలువైన భూమిని ఆసుపత్రి కోసం ఇచ్చింది మహారాజ కుటుంబం. కేంద్ర మంత్రిగా నిధులు కేటాయించి అత్యాధునిక వసతులతో అభివృద్ది చేసింది పూసపాటి అశోక్ గజపతి రాజు గారు. రాత్రికి రాత్రి మహారాజ పేరుని తొలగించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రభుత్వం వెంటనే ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి. ఆసుపత్రి కి మహారాజ పేరు కొనసాగించాలి”. అని ట్వీట్ చేశారు.