తిరుమల శ్రీవారి భక్తులకు అలెర్ట్. తిరుమల శ్రీవారి సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతుంది. 13 కంపార్టుమెంట్లలో భక్తులు వేచివున్నారు. టోకేన్ లేని భక్తుల సర్వదర్శనంకు 12 గంటల సమయం పడుతోంది. ఇక అటు నిన్న తిరుమల శ్రీవారిని 73,543 మంది భక్తులు..దర్శించుకున్నారు. 21,346 మంది భక్తులు.. నిన్న తలనీలాలు సమర్పించారు. నిన్న శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లుగా నమోదు అయింది.

తిరుమలలోని టీటీడీలో మార్పులు, చేర్పులు జరుగుతున్నాయి. టీటీడీ ఎస్టేట్ అధికారిగా జి.సువర్ణమ్మ నియామకం అయ్యారు. డిప్యూటీ ఈవోలుగా వెంకట్ సునీల్, సోమ నారాయణ్ నియామకం అయ్యారు. గత వైసీపీ ప్రభుత్వంలో డిప్యూటేషన్ పై వచ్చిన అధికారులను త్వరలో బదిలీ చేయనుండి టీటీడీ పాలక మండలి.