రేపు విజయవాడ జైలుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. విజయవాడ జైలులో వల్లభనేని వంశీని కలవనున్నారు జగన్. ఈ మేరకు బెంగళూరు నుంచి రేపు విజయవాడ జైలుకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి రానున్నారు. ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు వైసీపీ పార్టీ నేతలు. కాగా.. విజయవాడ జైలు లో వల్లభనేని వంశీ ఉన్న సంగతి తెలిసిందే.
కాగా, గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీకి చుక్కలు చూపిస్తున్నారు ఏపీ పోలీసులు. తాజాగా వైసీపీ నేత వల్లభనేని వంశీ ఫోన్ కోసం పోలీసులు వేట మొదలు పెట్టారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే, వైసీపీ నేత వల్లభనేని వంశీని ఇప్పటి కే అరెస్ట్ చేసిన పోలీసులు… ఆయన ఫోన్ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పటికే హైదరాబాద్‌కు రెండు ప్రత్యేక పోలీసు బృందాలు వచ్చినట్లు తెలుస్తోంది.