మైనింగ్ రంగంపై జగన్ సంచలన నిర్ణయం..అమలులోకి ‘ఈ-ఆక్షన్’ విధానం

-

మైనింగ్ రంగంపై జగన్ సర్కార్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నం లోని డిఎంజి కార్యాలయంలో లీజుదారులతో రాష్ట్ర గనులశాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ.. మైనింగ్ రంగంలో సీఎం వైయస్ జగన్ విప్లవాత్మక సంస్కరణలు తెచ్చారన్నారు. ఎక్కువ మందికి మైనింగ్ లో అవకాశం కల్పించేందుకే ‘ఈ-ఆక్షన్’ విధానం తీసుకోస్తున్నట్లు వెల్లడించారు.

cm jagan
cm jagan

పారదర్శకతతో వేగంగా లీజుల జారీకి చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ఔత్సాహికులకు ప్రోత్సాహకరంగా కొత్త విధానం అని.. ఎక్కువ క్వారీలను ఆపరేటింగ్ లోకి తీసుకురావాలన్నదే లక్ష్యమన్నారు. మైనింగ్ ఆధారిత పరిశ్రమలు పెరిగి, యువతకు ఉపాధి అవకాశాలు లభిస్తాయని.. ఈ విధానం పై లీజుదారుల సహకారం కోరుతున్నామని చెప్పారు. లీజుదారుల అభిప్రాయాలను ఆహ్వానిస్తున్నామని.. ఎక్కడైనా సమస్యలు ఉంటే సీఎం దృష్టికి తీసుకువెళ్ళి పరిష్కరిస్తామని ప్రకటించారు.

Read more RELATED
Recommended to you

Latest news