నిన్న తూర్పు గోదావరి జిల్లాలో జనసేనాని పవన్ కళ్యాణ్ పర్యటించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా పంట పొలాలను, నష్టపోయిన రైతులను ఓదార్చారు. అలాగే, వైసీపీ సర్కార్ విరుచుకుపడ్డారు జనసేనాని పవన్ కళ్యాణ్. అయితే, జనసేనాని పవన్ కళ్యాణ్ తూర్పు గోదావరి జిల్లా పర్యటనపై మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు.
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కు 10 పంటలు చూపిస్తే అందులో ఐదు పంటలను గుర్తించలేడని విమర్శించారు కాకాణి గోవర్ధన్ రెడ్డి. పంటలు ఎలా పండిస్తారో కూడా పవన్ కు తెలియదని వ్యాఖ్యానించారు. టీడీపీ హయాంలో రైతులకు ఆనవాయితీగా ఇచ్చే ఇన్ పూట్ సబ్సిడీని ఎగనామం పెట్టారని, సీడ్ బకాయి, ధాన్యం కొనుగోళ్లు బకాయిలు కలిపి సుమారు 5 వేల కోట్ల రూపాయలు పెండింగ్ లో ఉందని ఆరోపించారు. ప్రస్తుతం చంద్రబాబు, పవన్ కల్యాణ్ ను చూసి ధాన్యం కొనుగోలు చేయడం లేదని, రొటీన్ గానే కొనుగోళ్లు జరుగుతున్నాయని అన్నారు మంత్రి కాకాణి గోవర్థన్ రెడ్డి.