తెలంగాణలో బీజేపీ రేసులోకి వస్తుందని పెద్దగా ఎవరు ఊహించి ఉండరు..కానీ ప్రతిపక్షంగా ఉన్న కాంగ్రెస్ ఫెయిల్ అవ్వడం, అటు కేసిఆర్ కేంద్రాన్ని టార్గెట్ చేయడంతో..రాజకీయ యుద్ధం బిఆర్‌ఎస్ వర్సెస్ బిజేపిగా మారింది. ఇదే క్రమంలో రెండు ఉపఎన్నికల్లో గెలవడం, జిహెచ్‌ఎంసి ఎన్నికల్లో బిజేపి అనూహ్యంగా సత్తా చాటడం..కొందరు కీలక నేతలు బిజేపిలో జాయిన్ అవుతూ రావడంతో సీన్ మారిపోయింది. బిజేపి అనూహ్యంగా రేసులోకి వచ్చింది.
దీంతో నెక్స్ట్ ఎన్నికల్లో బిఆర్‌ఎస్‌కు బిజేపినే ప్రత్యామ్నాయం అనే పరిస్తితి వచ్చింది. కానీ ఇటీవల కాలంలో బిజేపి అనుకున్న విధంగా సక్సెస్ అవ్వడం లేదనే చెప్పాలి. మునుగోడు ఉపఎన్నిక నుంచి బిజేపి కాస్త వెనుకబడింది. రాజకీయంగా బిఆర్‌ఎస్, బిజేపిల మధ్య యుద్ధం జరుగుతుంది గాని..అనుకున్న స్థాయిలో బిజేపి బలపడటంలో విఫలమవుతుంది. అంతకముందు బిజేపిలోకి వలసలు పెద్ద ఎత్తున జరిగాయి. కానీ మునుగోడు ఉపఎన్నిక, ఎమ్మెల్యేల కొనుగోలు అంశం తర్వాత చేరికలు పెద్దగా లేవు. దీంతో బిజేపి అనూహ్యంగా ఫెయిల్ అవుతూ వస్తుంది.
అసలు బిజేపికి రాష్ట్ర స్థాయిలో పూర్తి బలంలేదు..ఏదో కొన్ని ప్రాంతాల్లోనే బలం ఉంది. ఇక ఇప్పటికిప్పుడు బిజేపి బలపడాలంటే..బిఆర్‌ఎస్, కాంగ్రెస్ ల నుంచి నాయకులని తీసుకోవాలని సర్వేలు స్పష్టం చేశాయి. కానీ అనుకున్న స్థాయిలో చేరికలు జరగలేదు. ఈటల రాజేందర్ నేతృత్వంలోని చేరిక కమిటీ అనుకున్న మేర..నేతలని బిజేపిలోకి లాగడంలో విఫలమైంది.
ఇటీవల పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు లాంటి వారితో భేటీ అయ్యి, బిజేపిలోకి ఆహ్వానించింది గాని..వారు ఇంకా ఏ నిర్ణయం చెప్పలేదు. ఇలా కొత్త చేరికల విషయంలో బిజేపి ఫెయిల్ అయింది. అయితే మరో రెండు రోజుల్లో కర్నాటక అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు రానున్నాయి. అక్కడ బిజేపి గాని గెలిస్తే..తెలంగాణలో చేరికలు ముమ్మరం అవుతాయేమో చూడాలి కాంగ్రెస్ గెలిస్తే సీన్ మారిపోతుంది.