నందమూరి కుటుంబాన్ని ఎవ్వడూ పట్టించుకోరు – మంత్రి కాకాణి

చంద్రబాబు బతికి ఉన్నంతవరకూ నారా కుటుంబానికే ప్రాధాన్యం ఇస్తారు…నందమూరి కుటుంబాన్ని పట్టించుకోరని ఎద్దేవా చేశారు మంత్రి కాకాణి. జూనియర్ ఎన్.టి.ఆర్.ను కూడా కలవవద్దని పార్టీ నేతలకు చంద్రబాబు చెప్పారు…టిడిపి లో కొందరు నేతలు జూనియర్ ఎన్.టి.ఆర్.ను కోరుకుంటున్నారన్నారు. విద్యా రంగంలో విప్లవాత్మకమమైన మార్పులను జగన్ తీసుకువచ్చారని.. మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి పేర్కొన్నారు.

చంద్రబాబు చదువుకున్న స్కూల్ ను కూడా నాడు..నేడు లో జగన్ అభివృద్ధి చేశారని.. ఎన్.టి.ఆర్.జిల్లా పేరు పెట్టి జగన్ ఆయాణపై వున్న అభిమానాన్ని చూపారని వెల్లడించారు. అమరావతి రైతుల యాత్ర కు అన్నీ చంద్రబాబే సమకూరుస్తున్నారు..ఆయన కనుసన్నల్లోనే యాత్ర జరుగుతోంది.. ఇది అందరికీ తెలిసిందేన్నారు. అమరావతి కోట్లు ఖర్చు పెట్టినా ఎందుకు లోకేష్ ను ఓడించారో గుర్తించాలని.. బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు సరికాదని విమర్శలు చేశారు. వైద్య రంగానికి వై.ఎస్.ఆర్.చేసిన సేవలను గుర్తుంచుకునే హెల్త్ యూనివర్సిటీ కి ఆయన పేరు పెట్టారని.. ఇది సముచితమని మేము..ప్రజలు భావిస్తున్నారని తెలిపారు.