టిడిపి నేతలకు దమ్ముంటే స్కిల్ స్కాంపై చర్చకు రావాలని అసెంబ్లీలో మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి అన్నారు. టిడిపి సభ్యుల రౌడీయిజం చూసి భయపడేవారు ఎవరు ఇక్కడ లేరన్నారు. విజిల్స్ వేస్తూ దేవాలయం లాంటి అసెంబ్లీ ఎక్కించపరుస్తున్నారని మండిపడ్డారు. ప్రజా సమస్యలపై అసెంబ్లీలో చర్చ జరిగేందుకు సహకరించాలన్నారు. నోటికోచ్చినట్లు బజారు కూతలు కూస్తే ఎవర్ని వదిలిపెట్టమని గోవర్ధన్ హెచ్చరించారు.
ఇక అటు తెలుగు దేశం పార్టీ ఆఫీసులో మీసాలు తిప్పుకోండని బాలయ్యకు మరోసారి అంబటి రాంబాబు కౌంటర్ ఇచ్చారు. అసెంబ్లీ మీడియా పాయింట్ దగ్గర అంబటి రాంబాబు మాట్లాడుతూ… చంద్రబాబు అరెస్ట్ పై సరైన ఫార్మాట్ లో రాకుండా టీడీపీ నేతలు గందరగోళం సృష్టించారని..చంద్రబాబు అవినీతి పై చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఆగ్రహించారు. టీడీపీ ఉద్ధేశం చర్చ కాదు..రచ్చ అని.. శాసనసభలో గందరగోళం సృష్టించాలనే ప్రయత్నం చేయాలేనేదే టీడీపీ ఉద్ధేశం అంటూ చురకలు అంటించారు. చంద్రబాబు అవినీతి పై ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చించేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఈ రోజైనా సరైన ఫార్మాట్ లో చర్చకు రావాలని కోరుతున్నామని పేర్కొన్నారు.