రాజధాని పిటిషన్లపై ఏపీ హై కోర్టులో రైతులకు చుక్కెదురు !

-

ఆంధ్ర ప్రదేశ్‌ రాజధాని పిటిషన్లపై ఏపీ హై కోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. రాజధాని పిటిషన్లపై హైకోర్టులో ఇవాళ విచారణ జరిగింది. ఈ సందర్భంగా రాజధాని పనుల పురోగతిపై స్టేటస్ రిపోర్ట్ దాఖలు చేసింది ఏపీ ప్రభుత్వం. తాము మరో కోర్టు ధిక్కార పిటిషన్ వేశామని అటు రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్ కోర్టుకు వివరించారు.

- Advertisement -

ప్రభుత్వ స్టేటస్ రిపోర్టుపై కౌంటర్ దాఖలు చేయాలని పిటిషనరుకు హైకోర్టు త్రిసభ్య ధర్మాసనం ఆదేశించింది. రాజధానిలో పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీపై నిర్ణయం ప్రకటించాలని కోరిన ఏజీ…. ఆ ఫైల్ వద్ద తమ వద్దే ఉందని.. పరిశీలించి నిర్ణయం తీసుకుంటామని పేర్కొంది హై కోర్టు. ఎల్పీఎస్ లే అవుట్లల్లో పనులు ఆలస్యం కావడంతో తమకు పరిహరం చెల్లించాలన్న పిటిషనుపై నిర్ణయం తీసుకోవాలన్నారు రైతుల తరపు న్యాయవాది ఉన్నం మురళీధర్. పిటిషన్ను పరిశీలిస్తామన్న ధర్మాసనం… ఆగస్టు 23వ తేదీకి కేసు విచారణ వాయిదా వేసింది.

Read more RELATED
Recommended to you

Latest news

Must read

జీతం అడిగితే నోటితో చెప్పులు మోయించారు…!

సమాజంలో నేడు పరిస్థితులు ఎలా ఉన్నాయంటే కష్టపడి నెలంతా పనిచేసినా కానీ...

ఢమాల్: కుప్పకూలిన స్టాక్ మార్కెట్లు…అన్ని రంగాలు డౌన్ !

విజయదశమి రోజున ముదుపర్లకు భారీగా నష్టాలు వచ్చినట్లుగా తెలుస్తోంది. ఈ రోజు...