కొడాలి నానికి క్యాన్సర్.. క్లారిటీ..!

-

మాజీ మంత్రి, వైసీపీ ఎమ్మెల్యే కొడాలి నాని అనారోగ్యంగా ఉన్నారని, ఆయనకి క్యాన్సర్ అంటూ గత రెండు రోజులుగా పలు మీడియాలలో ప్రచారం జరుగుతుంది. ఈ రూమర్స్ పై తాజాగా గుడివాడ వైసీపీ నేతలు స్పందించారు. కొడాలి నానిని దైర్యంగా ఎన్నికలలో ఎదుర్కోలేక, తప్పుడు రాతలు రాస్తూ, తప్పుడు కథనాలు ప్రచారం చేస్తూ, అసుద్ధం తినటానికి కూడా సిద్ధపడ్డ దుష్టచతుష్టయం ఇలాంటి ఆరోపణలు చేస్తుందని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

కొడాలి నాని బంతి లాంటి వాడని.. మీరు ఎంత తొక్కాలని చూస్తే ఆయన అంత పైకి ఎగురుతాడన్నారు. కొడాలి నాని గారు యెటువంటి హాస్పిటల్స్ లో జాయిన్ అవ్వలేదని.. గత వారం రోజులుగా గుడివాడలోనే ఉంటు ప్రజల సమస్యలు వింటు వాటిని పరిష్కిరించారని స్పష్టం చేశారు. ఆదివారం బాబ్జి గారి జయంతి కార్యక్రమాల్లో పాల్గొన్నారని తెలిపారు గుడివాడ వైసిపి నేతలు.

కొండలమ్మ వారికి ఆషాడ సారే కూడా అందించారని తెలిపారు. కుటుంబ సభ్యులు విదేశాల నుండి వస్తే వాళ్ళని రిసీవ్ చేసుకునే క్రమంలో నిన్న హైదరాబాద్ వెళ్ళారని తెలిపారు. ప్రస్తుతం విజయవాడలో ఆయన వ్యక్తిగత కార్యక్రమంలో ఉన్నారని.. సాయంత్రానికి గుడివాడ వస్తారని తెలిపారు. ఎప్పటిలానే ప్రజల సమస్యల పై అందుబాటులో ఉంటారని తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news