రాజకీయాల్లోకి జూనియర్ ఎన్టీఆర్ ? కొడాలి నాని సంచలన వ్యాక్యలు

-

నందమూరి వారసుడు జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై ఎప్పటి నుంచో ఊహాగానాలు వస్తూనే ఉన్నాయి. తెలుగుదేశం పార్టీ ప్రస్తుతం క్లిష్ట పరిస్థితుల్లో ఉండడంతో, ఆయన ఆ పార్టీ బాధ్యతలు చేపడతారని, రాజకీయాలలో యాక్టివ్ అవుతారని చాలా కాలంగా ప్రచారం జరుగుతూ వస్తోంది. ఈ రకమైన వార్తలపై జూనియర్ ఎన్టీఆర్ ఎప్పుడు పెద్ద పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ వస్తున్నారు. తాజాగా ఎన్టీఆర్ కు అత్యంత సన్నిహితుడైన కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ పొలిటికల్ ఎంట్రీ పై క్లారిటీ ఇవ్వడంతోపాటు సంచలన వ్యాఖ్యలు చేశారు. నారా లోకేష్ ఎమ్మెల్యే గా ఎన్ని కావాలంటే జూనియర్ ఎన్టీఆర్ నాయకత్వంలోని ఎన్నికలకు వెళితే అది సాధ్యం అవుతుంది అంటూ ఆయన వ్యాఖ్యానించారు.
ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నాని ఈ వ్యాఖ్యలు చేశారు. జూనియర్ ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే, ఆయనకు భవిష్యత్తు బాగుంటుందని, కాకపోతే ఎన్టీఆర్ వయసు చిన్నదని , ఆయన పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు చాలా సమయం ఉందని నాని చెప్పుకొచ్చారు. అయితే ఆయన ఎంట్రీ టిడిపి లో ఉంటుందా లేక కొత్త పార్టీ పెడతారా అనే విషయం ఇప్పట్లో చెప్పలేమని, పరిస్థితులను బట్టి ఉంటుంది అంటూ వ్యాఖ్యానించారు. ఒకవేళ తెలుగుదేశం పార్టీ అప్పటికీ చంద్రబాబు కుటుంబ సభ్యుల ఆధీనంలో ఉంటే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ పార్టీ పెడతారని ఆయన వ్యాఖ్యానించారు.
ప్రస్తుత రాజకీయాల్లో జూనియర్ ఎన్టీఆర్ నెగ్గుకు రావాలంటే గట్టిగానే కష్టపడాలన్నారు. ప్రజా సమస్యలపై స్పందిస్ ప్రజల్లో మరింత బలం పెంచుకోవాలని, అప్పుడే ఆయన సక్సెస్ అవుతారని నాని చెప్పుకొచ్చారు. కాకపోతే తప్పనిసరిగా ఎన్టీఆర్ రాజకీయ ఎదుగుదలకు లోకేష్ అడ్డుపడతారని, ఇది అందరికీ తెలుసునని చెప్పారు. చంద్రబాబు వంశం మంచిది కాదని, టీడీపీ వాళ్లు కూడా వైసీపీకి ఓటు వేసి లోకేష్ ను తప్పనిసరిగా ఓడిస్తారు అంటూ ఎద్దేవా చేశారు. ఒకవేళ ఎన్టీఆర్ పార్టీ పెట్టినా తాను చివరి వరకు జగన్ తోనే ఉంటానని క్లారిటీ ఇచ్చారు. కొడాలి నాని జూనియర్ ఎన్టీఆర్ అత్యంత సన్నిహితుడిగా పేరు పొందారు. అయినా జూనియర్ ఎన్టీఆర్ సొంతంగా పార్టీ పెట్టిన తాను జగన్ వెంట నడుస్తానని చెప్పడం సంచలనంగా మారింది.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news