తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ వేడుకల్లో భాగంగా నేడు సుపరిపాలన ఉత్సవాలను ఉద్దేశించి మంత్రి కేటీఆర్ ట్వీట్ చేశారు. తెలంగాణ ప్రభుత్వం స్వపరిపాలన ఫలాలనే కాదు… సుపరిపాలన సౌరభాలను ప్రతి వర్గానికి అందిస్తోందని పేర్కొన్నారు. ప్రజలే కేంద్రంగా సాగిన తెలంగాణ సంస్కరణ పథం యావత్ భారతావనికే ఓ పరిపాలన పాఠం అని తెలిపారు. ప్రభుత్వ ప్రతి నిర్ణయం పారదర్శకమని… ప్రతి మలుపులో జవాబుదారితనం ఉందని ట్వీట్ చేశారు.
కాగా, తెలంగాణ రాష్ట్ర దశాబ్ది అవతరణ దినోత్సవాల్లో భాగంగా నేడు సుపరిపాలన ఉత్సవాలు నిర్వహించనున్నారు. స్వరాష్ట్రంలో సుపరిపాలన పేరుతో ఈ కార్యక్రమం జరపనున్నారు. రాష్ట్రం ఏర్పడ్డాక పరిపాలన వికేంద్రీకరణలో సంక్షేమ పథకాలు సమర్ధవంతంగా అమలయ్యాయని ప్రభుత్వం పేర్కొంది. 2016లో 10 జిల్లాలు ఉండగా… 23 కొత్త జిల్లాలు ఏర్పాటు చేశామని తెలిపింది. దీని ద్వారా పరిపాలన సౌలభ్యం కలిగిందని వెల్లడించింది.
"స్వపరిపాలనా" ఫలాలనే కాదు
'సుపరిపాలనా" సౌరభాలను
సమాజంలోని ప్రతి వర్గానికి
సగర్వంగా అందిస్తోంది
మన తెలంగాణ
ప్రభుత్వంతొమ్మిదేళ్ల
తెలంగాణ ప్రస్థానంలో
ఎన్నో చారిత్రక నిర్ణయాలు
మరెన్నో విప్లవాత్మక సంస్కరణలు"ప్రజలే కేంద్రం"గా సాగిన
తెలంగాణ సంస్కరణల పథం
యావత్ భారతావనికే ఓ… pic.twitter.com/mY63G4w0kM— KTR (@KTRBRS) June 10, 2023