నేడు, రేపు టీడీపీ మహానాడు జరుగనుంది. నేటి నుంచి రాజమహేంద్రవరంలో రెండు రోజులపాటు టిడిపి మహానాడు జరగనుంది. నేడు 15 వేల మంది ప్రతినిధులు 35 వేల మంది కార్యకర్తలతో సభ నిర్వహించనున్నారు.
రేపు సాయంత్రం 15 లక్షల మందితో భారీ బహిరంగ సభకు టిడిపి ఏర్పాటు చేస్తోంది. మహానాడు వేదికగా అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోను చంద్రబాబు విడుదల చేసే అవకాశం ఉంది. కాగా, తమ గోదావరి రుచులు చవి చూడాలంటూ మాజీ డిప్యూటీ సీఎం నిమ్మకాయల చిన్న రాజప్ప పార్టీ శ్రేణులకు ఆహ్వానం పలికారు. ఇవాళ ఇక్కడ 50,000 మందికి భోజనం తయారు చేయిస్తున్నారు. ఉదయం, సాయంకాలం కూడా భోజనాలు ఉంటాయి. 28వ తేదీన కూడా ఇక్కడ తయారు చేస్తారు. మహానాడు పూర్తయ్యే వరకు గోదావరి రుచులు గుమగుమలాడనున్నాయి. అచ్చెన్నాయుడు తదితర టిడిపి ముఖ్య నాయకులు శుక్రవారం భోజనాలు రుచి చూశారు. పోలీస్ బ్యూరో సభ్యుడు గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మాజీమంత్రి చిక్కాల రామచంద్రరావు, గన్ని కృష్ణ, ఆదిరెడ్డి వాసు తదితరులు ఏర్పాట్లను పరిశీలించారు.