నేడు తెలంగాణకు రానున్న కేజ్రీవాల్.. సీఎం కేసీఆర్ తో భేటీ

-

ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ నేడు తెలంగాణకు రానున్నారు. ఢిల్లీ విద్యాశాఖ మంత్రి అతిషితో కలిసి ఆయన సీఎం కేసీఆర్ తో భేటీ కానున్నారు. ఢిల్లీలో అధికారుల నియామకాలు, బదిలీలపై కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్ ను పార్లమెంటులో వ్యతిరేకించాలని ఆయన విపక్షాల మద్దతు కూడగడుతున్నారు.

ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ను కలిసి మద్దతు కోరనున్నారు. ఢిల్లీలో అధికారుల పోస్టింగ్, బదిలీలకు సంబంధించి కేంద్రం ఇటీవల తీసుకువచ్చిన ఆర్డినెన్స్ కి వ్యతిరేకంగా ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ విపక్షాల మద్దతు కూడ గడుతున్న సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే ఇవాళ సిఎం కెసిఆర్ తో సమావేశం కానున్నారు ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీ వాల్.

Read more RELATED
Recommended to you

Latest news