నేను ఆ పార్టీకే ఓటు వేశాను – మేకపాటి చంద్రశేఖరరెడ్డి

 

ఎమ్మెల్యే ఎన్నికల ఫలితాలపై వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి స్పందించారు. నేను పార్టీ చెప్పిన ప్రకారం వెంకర రమణ కే ఓటు వేశానని.. ఆయన గెలిచారు…నన్ను ఎవరూ అనటానికి లేదని ఫైర్‌ అయ్యారు. నేను పార్టీకి చేసిన.. ఓటు వేసిన తర్వాత నేను ముఖ్యమంత్రి జగన్ ని కలిసి వచ్చానని వివరించారు.

ఎమ్మెల్యే పదవినే తృణప్రాయంగా వదిలి వచ్చిన వాడిని అని పేర్కొన్నారు. టికెట్ ఇస్తే పోటీ చేస్తా…లేదంటే లేదని తేల్చి చెప్పారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి. నియోజకవర్గంలో నేను ఏంటో చూపిస్తానని… జగన్ కూడా టికెట్ విషయంలో నాకు సానుకూలంగా లేరని పేర్కొన్నారు. ఎవరో నా మీద తప్పుడు సమాచారం ముఖ్యమంత్రి కి మా పార్టీ నేతలే ఇచ్చారని మండిపడ్డారు వైసీపీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖరరెడ్డి.