ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతా – ఆర్.కే.రోజా

ఆడపిల్ల అనుకుంటున్నారా…ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని ప్రతి పక్షాలకు ఆర్.కే.రోజా వార్నింగ్‌ ఇచ్చారు. 12 ఏళ్లుగా ఎన్నో కుట్రలు చేశారు, వాటిని ఎదురించి నిలబడి దమ్మున్న నాయకుడు జగన్ మోహన్ రెడ్డి అని కొనియాడారు. వై.ఎస్.ఆర్ చనిపోయిన తర్వాత ఆశయాలు చిదిమేయాలని చూశారని.. దేశంలో ఎందరో ముఖ్యమంత్రులు ఉన్నారు, కానీ ప్రధాని తో సహా ప్రశంశలు అందుకున్న ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి అని చెప్పారు.

సంక్షేమ పథకాలు సామ్రాట్ జగన్ మోహన్ రెడ్డి ఒక్కరేనని… చంద్రబాబు పాలనలో సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇచ్చిన సంక్షేమ పథకాలు ఏనాడైనా ఇచ్చారా..అని సవాల్ విసురుతున్నానన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి కోసం ప్రతి రాష్ట్రం అప్పులు చేస్తుంది, ప్రధాని కూడా అప్పులు చేస్తారు, కానీ ఈరోజు అందించిన ప్రతి నగదుకు ఒక లెక్క ఉందని.. గడప గడపకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని వెల్లడించారు.

అమ్మఒడి కోతలు పెట్టారు అంటూ అసత్య ప్రచారం చేస్తున్నారు, కోవిడ్ సమయం లో ప్రతి ఒక్క విద్యార్థి కి అమ్మఒడి అందించారని.. కొంతమంది గ్రామ సింహాలు, ప్రతి పక్షాలు ఆడపిల్ల ను అని చూడకుండా విష ప్రచారం చేస్తున్నారని పేర్కొన్నారు. నా మౌనం చేతకాని తనం కాదు, ఒక్కొక్కరికి బాక్స్ బద్దలు కొడతానని హెచ్చరించారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈరోజు నగరి నియోజకవర్గం అభివృద్ధి చేశామని.. 684 కోట్ల రూపాయలు ప్రజలకు సంక్షేమ పథకాలు ద్వారా అందించామన్నారు.