అమరావతి పేరు చెడ కొట్టారు.. : ఏపీ మంత్రి

అమరావతి పేరును రాజధానికి పెట్టి ఆ పేరును చెడగొట్టారని అంటూ ఏపీ మంత్రి డా.సీదిరి అప్పలరాజు అనుచిత వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం అమరావతి రాజకీయ ఎత్తుగడలకు కేంద్రంగా మారిందని ఆయన విమర్శించారు. తానే అమరావతికి పేరు తెచ్చినట్లు చంద్రబాబు వ్యవహరిస్తున్నారన్న ఆయన ధ్యాన బుద్ధ విగ్రహం పై చంద్రబాబుకు పేటెంట్ లేదని అన్నారు. మనుషుల మధ్య విధ్వేషాలు రెచ్చగొట్టేలా టీడీపీ నేతలు వ్యవహరించడం బాధాకరమని, ఇంకా ఎన్ని రోజులు ఈ పెయిడ్ ఆందోళనలను నడిపిస్తారని అంటూ ఆయన ప్రశ్నించారు.

అమరావతిలో పెయిడ్ దీక్షలకు కమ్యూనిస్టులు మద్దతు తెలపడం దారుణమని, చరిత్రలో భూస్వామ్యులకు వత్తాసు పలికిన చరిత్ర ప్రస్తుత కమ్యూనిస్టులకే చెల్లిందని అన్నారు. రైతుల ప్రయోజనాలను కాపాడటంలో వైఎస్.జగన్ ముందుంటారని, అమరావతిలో రైతులకు మేలు చేస్తున్నది జగన్ ఒక్కరేనని మంత్రి చెప్పుకొచ్చారు. తాత్కాలిక రాజధానిని కట్టానని చంద్రబాబు ఎందుకు ఒప్పుకోవడం లేదన్న ఆయన మూడురాజధానుల పై టీడీపీ సూడో ఉధ్యమం చేస్తోందని అన్నారు, మూడు రాజధానులకు గవర్నర్ ఆమోదం తెలిపినప్పటికీ… ఎందుకీ ఆందోళనలు అని అయన ప్రశ్నించారు.