జగన్ పై ఎమ్మెల్యే బాలకృష్ణ సంచలన వ్యాఖ్యలు చేశారు. హిందూపురం రూరల్ పరిధిలోని కొటిపిలో అర్ధాంతరంగా నిలిచిపోయిన టిడ్కో గృహాలను పరిశీలించిన ఎమ్మెల్యే బాలకృష్ణ….కొటిపిలో రూ.4 కోట్ల విలువతో నిర్మించనున్న విద్యుత్ సబ్స్టేషన్ నిర్మాణానికి భూమి పూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడుతూ… ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ఒక్కొక్క శాఖలో అవినీతి బయట పడుతోందని తెలిపారు. మున్ముందు శాఖలో జరిగిన అక్రమాలు అన్ని బయటకు వస్తాయన్నారు.
వ్తెసీపీలో వ్యవస్థలన్నింటిని నాశనం చేశారని… ఇసుక , మద్యం , మ్తెనింగ్ లలో అక్రమాల చేసి కమీషన్లకు పాల్పడ్డారని తెలిపారు. పరిపాలన చేయడం చేతకాక …మూడు రాజధానులు , నవరాత్నల పేరుతో మోసం చేశారు…టిడిపి హాయంలో లేటేస్ట్ టెక్నాలజీ టిడ్కో ఇళ్ల నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. వ్తెసీపీ ప్రభుత్వం పట్టించుకోక పోవడంతో నిర్మాణాలు ఆగిపోయాయి…. ప్రతి నిరుపేదకు ఇల్లు నిర్మించి ఇవ్వాలనేదే తెలుగుదేశం పార్టీ లక్ష్యమన్నారు. టిడ్కో గృహాలల్లో ఉన్న సామాగ్రిని నాశనం చేసి పెట్టారని… ఆరు నెలల్లో వాటిని పూర్తి చేసి ప్రతి నిరుపేదకు అందిస్తామని ప్రకటించారు.