ఫోరెన్సిక్ ల్యాబ్ కు ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియో

వైసీపీ పార్టీ నేత, హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌ ఓ మహిళతో న్యూడ్‌ గా వీడియో కాల్‌ మాట్లాడిన వీడియో బయట పడింది. ఆ వీడియోలో న్యూడ్‌ గా ఉన్న హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌.. ఆ మహిళతో మాట్లాడుతున్నాడు. మహిళతో శృంగారానికి సంబంధించిన విషయాలను మాట్లాడినట్లు రికార్డు అయింది. ఎంపీ గోరంట్ల మాధవ్‌ రాసలీలల వీడియో లీక్‌ కావడంతో సోషల్‌ మీడియాలో వైరల్‌ గా మారింది.

అయితే..ఈ వీడియోలపై ఎంపీ గోరంట్ల మాధవ్‌ క్లారిటీ ఇచ్చారు. వీడియో లను మార్ఫింగ్ లు చేసి నన్ను అప్రతిష్ఠపాలు చేసే కుట్ర, కుతంత్రమని.. ఏ విచారణకైనా సిధ్దమని స్పష్టం చేశారు.అయితే వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ ముఖచిత్రంతో వైరల్ అవుతున్న న్యూడ్ వీడియో ఆయనదేనా? లేదంటే గిట్టని వాళ్ళు చేసిన మార్ఫింగ్ మాయా? ఎంపీ నగ్నచిత్రంపై పార్టీ అధిష్టానం మాత్రం సీరియస్ గా ఉంది.

ఆ వీడియోను ఫోరెన్సిక్ ల్యాబ్ కు పంపింది. నిజమని తేలితే సస్పెండ్ చేయాలన్న ఆలోచనతో అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ విషయంపై ఇప్పటికే ప్రభుత్వ సలహాదారు సజ్జల, డిప్యూటీ సీఎం నారాయణస్వామి కూడా స్పందించారు. వీడియో వాస్తవమని తెలితే చర్యలు తప్పవని అన్నారు.