మోడీని నిత్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తూ ఉంటారు – బండి సంజయ్

-

మోడీని నిత్యం కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలుస్తూ ఉంటారని.. అభివృద్ధి కి సంబంధించిన నిధుల విషయంలోనే కలుస్తూ ఉంటారని బండి సంజయ్ క్లారిటీ ఇచ్చారు. యాదాద్రిలో బండి సంజయ్ మీడియాతో మాట్లాడుతూ.. ఎవరు వెళ్లినా కలిసే వ్యక్తి ప్రధాని మోదీ అని తెలిపారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచేది బీజేపీనేనని.. ఉప ఎన్నికలు కోరుకున్నదే సీఎం కేసీఆర్ అని ఆగ్రహించారు.

మళ్లీ వాళ్లే ఉప ఎన్నిక ఎవరు కోరుకున్నారని ప్రశ్నించడం చూస్తుంటే… దెయ్యాలు వేదాలు వళ్ళించినట్టుందని చురకలు అంటించారు. చీకోటి ప్రవీణ్(క్యాసినో) వ్యవహారంలో సీఎం కేసీఆర్ కుటుంబంపై ఆరోపణలు వస్తున్నాయని.. నాగార్జున సాగర్, దుబ్బాక, హుజురాబాద్ ఉప్పు ఎన్నికల టైం లో 6 నెలల చొప్పున కేసీఆర్ టైం పాస్ చేసాడని ఆగ్రహించారు.

ఇప్పుడు మునుగోడు ఉప ఎన్నిక పేరుతో మళ్లీ 6 నెలలు టైం పాస్ చేస్తాడని.. కెసిఆర్ కుటుంబం పైనే అవని అవనీతి ఆరోపణలు వస్తున్నాయన్నారు. మమ్మల్ని ఎవరు కాపాడతారని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు నాయకులు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు.

 

Read more RELATED
Recommended to you

Latest news