ఏపీ రాజకీయాలు హాట్ హాట్ గా మారిపోయాయి. ఎప్పుడు ఏం జరుగుతుందో అని సందేహం అందరిలోనూ నెలకొంది. ఈ నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం బహిరంగ లేఖ రాశారు. జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రెండు సంవత్సరాల పాటు సీఎం పదవి కోరాల్సిందని ముద్రగడ పద్మనాభం లేఖలో పేర్కొన్నారు.
అసెంబ్లీ ఎన్నికలలో 80 సీట్లు లేదా రెండు సంవత్సరాల పాటు ముఖ్యమంత్రి పదవి కోరాల్సిందని ఆయన స్పష్టం చేశారు. కానీ ఆయన కలవలేదు… నా దగ్గరికి వచ్చి ఉంటే సీట్ల సర్దుబాటుపై సలహా ఇచ్చేవాడిని అంటూ సెటైర్లు పేల్చారు ముద్రగడ పద్మనాభం. పవన్ కళ్యాణ్ సొంత నిర్ణయాలు తీసుకోలేకపోతున్నాడని.. 24 సీట్లే కాబట్టి ఇక నా అవసరం ఉండదనుకుంటా అంటూ బాంబు పేల్చారు ముద్రగడ పద్మనాభం.