టీడీపీ అధినేత నారా చంద్రబాబును కలిశారు మునిరాజమ్మ. ఈ సందర్భంగా మునిరాజమ్మకు రూ.5 లక్షల సాయం ప్రకటించారు చంద్రబాబు నాయుడు. కొద్ది రోజుల క్రితం శ్రీకాళహస్తి లో నారా లోకేష్ యువగళం పాదయాత్ర సమయంలో తన బాధలను నారా లోకేష్ తో చెప్పుకుంది మునిరాజమ్మ. ఆ తర్వాత ఆమె హోటల్ పై దాడి జరిగింది. ఆ దాడి ఘటన వివరాలను, తన కుటుంబాన్ని ఊరు వదిలి వెళ్లమని వైసిపి నేతలు బెదిరించిన విషయాన్ని, వేధింపులను చంద్రబాబుకు వివరించింది మునిరాజమ్మ.
ఆరోగ్య సమస్యలు ఉన్న పిల్లలతో చిన్న హోటల్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న తన పరిస్థితిని బాబుకు వివరించింది. అమె బాధలు విన్న చంద్రబాబు నాయుడు మునిరాజమ్మకు రూ.5 లక్షల రూపాయాల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. అనంతరం ధైర్యంగా ఉండాలని, అక్రమ కేసులు, వైసిపి బెదిరిపుంలకు భయపడవద్దని..పార్టీ అండగా ఉంటుందని మునిరాజమ్మకు చంద్రబాబు సూచించారు.