బాలకృష్ణ హోస్ట్ గా కొనసాగుతున్న షో అన్ స్టాటబుల్. అయితే ఈ షోకు తాజాగా పవన్ కళ్యాణ్ ముఖ్యఅతిథిగా వచ్చారు. దీనికి సంబంధించిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే బాలయ్య షో కు పవన్ కళ్యాణ్ రావడం పై ఏపీ మంత్రి అంబటి రాంబాబు మండిపడ్డారు.
అన్నయ్య చిరంజీవిని అవమానించేలా పవన్ కళ్యాణ్ వ్యవహరిస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే పవన్ కళ్యాణ్ పై విమర్శలు చేసిన మంత్రి అంబటి రాంబాబుకు జనసేన నేత నాగబాబు కౌంటర్ ఇచ్చారు. అన్నయ్య షో కి డుమ్మా. బాలయ్య షో కి జమ్మ. రక్తసంబంధం కన్నా ప్యాకేజీ బంధమే గొప్పదా ? అని అంబటి రాంబాబు ట్విట్ చేయగా దానికి నాగబాబు కౌంటర్ ఇచ్చారు. ఏయ్.. ముందెళ్లి పోలవరం సంగతి చూడవోయ్… ఛీ పో వెధవ సోది అని నాగబాబు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు.