ద‌ళితుల గురించి ఈనాడు ప‌త్రిక రాయ‌డం హాస్యాస్ప‌దం – ఎంపీ నందిగం సురేష్

-

ద‌ళితుల గురించి ఈనాడు ప‌త్రిక రాయ‌డం హాస్యాస్ప‌దమని.. ఎస్సీల‌పై వివ‌క్ష చూపింది చంద్ర‌బాబు కాదా రామోజీ? అని ఫైర్‌ అయ్యారు వైసీపీ ఎంపీ నందిగం సురేష్. డాక్టర్ అచ్చెన్న హత్య వ్యవహారం ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగిన గొడవ… దీన్ని రాజకీయం చేయటం కరెక్ట్ కాదన్నారు నందిగం సురేష్. లోతుగా విచారణ చేస్తున్నామని.. దోషులు ఎలాంటి వారైనా ప్రభుత్వం కఠినంగా శిక్షిస్తుందని తెలిపారు.

టీడీపీ నాయకులు దళితులకు అన్యాయం జరిగిందని మాట్లాడటం హాస్యాస్పదం.. ఎవరైనా దళాతుడిగా పుట్టాలనుకుంటారా అన్న చంద్రబాబు ఇప్పటి వరకు దళితులను క్షమాపణ చెప్పలేదని ఆగ్రహించారు. టీడీపీ మద్దతు మీడియా దళిత వర్గాలకు, ప్రభుత్వానికి మధ్య దూరం పెంచే ప్రయత్నం చేస్తున్నాయి.. మీకు చంద్రబాబు పై ప్రేమ ఉంటే వీరుడు, శూరుడు అని రాసుకోండన్నారు. వైసీపీ ప్రభుత్వం పై విషం చిమ్మే ప్రయత్నం చేస్తే ప్రజలే బుద్ధి చెబుతారు…దళితుల నుంచి భూమి లాక్కుని రామోజీ ఫిల్మ్ సిటీ కట్టిన వాళ్ళు దళితుల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఫైర్‌ అయ్యారు.

Read more RELATED
Recommended to you

Latest news