అచ్చెన్నే అసలు ప్రత్యర్ధా ? లోకేష్ బ్యాచ్ భయమేంటి ?

-

పార్టీ నేతలు యాక్టివ్ గా ఉంటే, ఒక తంటా, లేకపోతే ఒక తంటా అన్నట్లుగా తయారైంది తెలుగుదేశం పార్టీలో పరిస్థితి. మొన్నటివరకు టిడిపి అధినేత ఒక్కరే ఆ బాధ్యతలను భుజాన వేసుకుని మోసేవారు. కరోనా ఏపీలో తీవ్రస్థాయిలో విజృంభిస్తున్న సమయంలో, తన ప్రాణాలను సైతం లెక్కచేయకుండా, చంద్రబాబు పార్టీ కోసం పెద్ద సాహసం చేశారు. ఆ సాహసమే చేయకపోతే పార్టీ ఇక కోలుకోవడం కష్టం అనే అభిప్రాయానికి వచ్చి, ఆకస్మాత్తుగా తెలుగుదేశం పార్టీలో పదవులను భర్తీ చేశారు. తెలుగుదేశం పార్టీ బాధ్యతలను శ్రీకాకుళం జిల్లా, టెక్కలి కి చెందిన టిడిపి ఎమ్మెల్యే కింజరాపు అచ్చెన్న నాయుడికి అప్పజెప్పారు. అయితే ఆ బాధ్యతలను అప్పగించడం చంద్రబాబు తనయుడు లోకేష్ కు ఏమాత్రం ఇష్టం లేదనే ప్రచారం జరిగింది. దీనికి తగ్గట్టుగానే, అచ్చెన్న పేరు ప్రకటించడానికి చంద్రబాబు చాలా గ్యాప్ తీసుకున్నారు.

ఏది ఏమైతేనేం అచ్చెన్న ఏపీ టిడిపి అధ్యక్షుడు అయిపోయాడు.అయితే ఆషామాషీగా ఆయన రాజకీయాలు చేస్తారా అంటే లేదు. సాధారణ ఎమ్మెల్యేగా ఉన్న సమయంలోనే తన ప్రతాపం చూపించేవారు.. అధికార పార్టీ తో పెట్టుకుంటే ఎంతటి తీవ్ర పరిణామాలను ఎదుర్కోవాల్సి వస్తుందో అనే విషయం తెలిసినా, ఆయన లెక్కచేయలేదు. అసెంబ్లీలోనూ బయట గట్టిగానే వైసీపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెడుతూ వచ్చే వారు. ఈ క్రమంలో ఆయన జైలుకు వెళ్లిన భయపడడం లేదు. అందుకే ఏరి కోరి తెలుగుదేశం పార్టీ పగ్గాలు  బాబు అప్పజెప్పారు.ఈ సంగతి ఇలా ఉంటే , ఇప్పుడు కొత్తగా టిడిపిలో పదవులను బాబు ప్రకటించారు. వందల మందితో రాష్ట్ర కమిటీ నింపేశారు.
ఇందులో లోకేష్ ముద్రపడ్డ వారే ఎక్కువ గా ఉన్నారు. రానున్న రోజుల్లో లోకేష్  ఎటువంటి ఇబ్బంది రాకుండా, చంద్రబాబు సామాజికవర్గాల కూర్పు చేస్తూనే లోకేష్ సన్నిహితులకు పదవులు కట్టబెట్టారు. ఇదిలా ఉంటే అచ్చెన్న పదవి తీసుకుని, గత టిడిపి అధ్యక్షుడిగా పని చేసిన కళా వెంకట్రావు మాదిరిగా సైలెంట్ గా ఉండి పోతారని, బాబు చెప్పుచేతల్లో ఉంటారు అనడానికి వీలు లేదని, ఆయన సొంతంగా బలం పెంచుకునేందుకు ప్రయత్నిస్తారు అని లోకేష్ , ఆయన బ్యాచ్ లో అప్పుడే అనుమానం వచ్చేసిందట. దీనికి తగ్గట్టుగానే ప్రెస్ మీట్ లు నిర్వహిస్తూ , టిడ్కో ఇళ్లపై ఏపీ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టేందుకు అప్పుడే కార్యాచరణ రూపొందించుకున్నారు.  అలాగే వైసిపి నాయకులు మీడియా సమావేశం పెట్టి మాట్లాడిన అంశాలకు కౌంటర్ లు ఇస్తున్నారు. అంతేకాకుండా గతంలో ఎప్పుడూ లేనివిధంగా, టిడిపి జిల్లా అధ్యక్షులతో పాటు, మిగిలిన కీలకమైన నాయకులతోనూ ఫోన్ లో మాట్లాడుతూ, ఏపీ టీడీపీ అధ్యక్షుడు హోదాను ప్రదర్శించేవారు.
ఇవన్నీ లోకేష్ , ఆయన టీం కు కాస్త కంగారు కలిగిస్తూనే ఉన్నట్లుగా ఇప్పుడు పార్టీ లో గుసగుసలు వినిపిస్తున్నాయి. అచ్చెన్న బాధ్యతలు స్వీకరించిన మొదట్లోనే ఈ విధంగా ఉంటే, రానున్న రోజుల్లో మరింతగా పార్టీ లో తన మార్కు చూపిస్తారని చంద్రబాబు తర్వాత తానే అన్నట్టుగా పరిస్థితి మారుస్తారని లోకేష్ ఆయన బ్యాచ్ పడే టెన్షన్ అంతా ఇంతా కాదట.
-Surya

Read more RELATED
Recommended to you

Latest news