BREAKING : 1500 కి.మీ. మైలురాయికి చేరుకున్న నారా లోకేష్‌ యువగళం

BREAKING : 1500 కి.మీ. మైలురాయికి చేరుకుంది నారా లోకేష్‌ యువగళం పాదయాత్ర. ఈ సందర్భంగా కడపలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థకు శిలాఫలకం ఆవిష్కరణ చేశారు నారా లోకేష్‌. జనగళమే యువగళమై 5కోట్ల మంది రాష్ట్రప్రజల ఆశీస్సులతో మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు కడపలో 1500 కి.మీ. మజిలీకి చేరుకోవడం సంతోషంగా ఉందని పోస్ట్‌ పెట్టారు నారా లోకేష్‌.

nara lokesh

ఈ సందర్భంగా కడపనగరంలో మెరుగైన డ్రైనేజి వ్యవస్థ ఏర్పాటుకు అలంఖాన్ పల్లె వద్ద శిలాఫలకాన్ని ఆవిష్కరించానని తెలిపారు. అధికారంలోకి వచ్చాక కడప నగర ప్రజలకు మురుగునీటి బెడద నుంచి విముక్తి కలిగించే ఈ కార్యక్రమాన్ని పూర్తిచేస్తానని యువగళం సాక్షిగా మాట ఇస్తున్నానని పేర్కొన్నారు లోకేష్‌.