మళ్లీ మంత్రి కావాలనే ఆశ నాకు లేదు..కానీ నా కోరిక అదే – నారాయణ స్వామి

-

నేను మళ్లీ మంత్రి కావాలనే ఆశ నాకు లేదని.. ఎల్లకాలం జగన్ సీఎంగా ఉండాలనేదే నా కోరిక అని డెప్యూటీ సీఎం నారాయణ స్వామి అన్నారు. డిప్యూటీ సీఎం పదవినిచ్చిన జగన్ నన్ను ఎంతో గౌరవించారని.. జగన్ నా యజమాని.. నా నాయకుడు ఆయన నిర్ణయమే ఫైనల్ అని పేర్కొన్నారు. నాకు ఎంతో గౌరవిచ్చిన వైఎస్ ఫ్యామ్లీకి నేనెప్పుడూ రుణపడే ఉంటానని.. వాణిజ్య పన్నుల శాఖ బాధ్యతలు తప్పించినప్పుడు నేనేం బాధపడలేదని స్పష్టం చేశారు.

దళితుడ్ని కాబట్టే వాణిజ్య శాఖ బాధ్యతల నుంచి నన్ను తప్పించారని కొందరు మూర్ఖులు కామెంట్లు చేశారని.. నన్ను డెప్యూటీ సీఎంను చేసినప్పుడు.. రాష్ట్రపతి ఛాంబర్లోకి తీసుకెళ్లినప్పుడు సీఎం జగన్ దళితుణ్ని గౌరవించారని ఎందుకు అనలేకపోయారని పేర్కొన్నారు.

నా శాఖపై ప్రతిపక్షాలు అర్థం లేని విమర్శలు చేశాయని.. జంగారెడ్డి గూడెం ఘటన.. నాణ్యత లేని మద్యం సరఫరా అంటూ ప్రతిపక్షాలు విమర్శించినా ఒక్క మహిళైనా ఉద్యమించిందా..? అని తెలిపారు. మద్యం ద్వారా వచ్చిన ఆదాయాన్ని సంక్షేమం కోసం ఖర్చు పెడుతున్నారంటూ ప్రతిపక్షం అర్ధరహిత ఆరోపణలు చేస్తోందని.. ప్రభుత్వ ఆదాయాన్ని చంద్రబాబు ఏనాడైనా పేదలకు పంచారా..? వారి సంక్షేమానికి వినియోగించారా..? అని స్పస్టం చేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version