పథకాల ప్రచారం కోసం త్వరలో ఏపీ SFL ఛానల్ ప్రారంభం

పథకాల ప్రచారం కోసం త్వరలో ఏపీ SFL ఛానల్ ప్రారంభం కానుంది. భారత దేశంలోనే తొలిసారిగా ఏపీలో కేబులుతో పాటు ఇంటర్నెట్ ఇస్తున్నాం…ప్రస్తుతం ఏపీ ఎస్ఎఫ్ఎల్ కు 10 లక్షల వరకు కనెక్షన్లున్నాయన్నారు ఏపీఎస్ఎఫ్ఎల్ ఛైర్మన్ పి.గౌతమ్ రెడ్డి. నాణ్యత కల్గిన అధునాతనంగా ఉండే కొత్త 50 లక్షల బాక్సులు కొనుగోలు చేయాలని నిర్ణయించాం…ఏపీ ఎస్ఎఫ్ఎల్ ఛానల్ ను ప్రారంభించాలని బోర్డులో నిర్ణయం తీసుకున్నామని వెల్లడించారు.

ప్రభుత్వం చేస్తోన్న మంచి పనులను ఛానల్ ద్వారా తెలియచేస్తాం…ఏపీఎస్ఎఫ్ఎల్ ను లాభాల బాటలో నడిపేందుకు సమగ్ర విధానాలు రూపొందించి అమలు చేస్తామన్నారు. గత పాలకులు చేసిన తప్పులపై విచారణ కొనసాగుతుంది…రాష్ట్రంలో అందరు ఆపరేటర్లు పోల్ టాక్స్ వల్ల ఇబ్బందులు పడుతున్నారు…వైసీపీ ప్రభుత్వం వచ్చిన నెలలోనే పోల్ టాక్స్ వసూలును డ్రాప్ చేసుకున్నామని తెలిపారు. గత ప్రభుత్వంలో ఇచ్చిన జీవోను రద్దు చేసేందుకు ప్రభుత్వం సానుకూలంగా ఉంది.ఇప్పటికే అధునాతన 30 వేల కొత్త బాక్సులను కొనుగోలు చేశామని తెలిపారు. కొత్త బాక్సులు కొనుగోలు చేయలేకపోవడం వల్లే గత మూడేళ్లలో ఒక్క కనెక్షన్లను కూడా పెంచుకోలేపోయాం…మాకు స్వతహాగా ఆదాయం లేకపోవడం, ఆర్థిక పరిస్థితి బాగోలేక పోవడం వల్ల విస్తరించలేకపోతున్నామని తెలిపారు. ప్రభుత్వ సహకారంతో ఆర్థిక సహకారం తీసుకుని ఏపీఎస్ఎఫ్ఎల్ ను విస్తరిస్తామ్మన్నారు.