ఏపీ ప్రధాన ప్రతిపక్షం టీడీపీలో ఆసక్తికర చర్చ సాగుతోంది. టీడీపీ అధినేత కుమారుడు, మాజీ మంత్రి నారా లోకేష్.. తదుపరి పార్టీ అధ్యక్షుడనే ప్రచారాన్ని నెమ్మదిగా తెరమీదికి తీసుకువస్తున్నారు. టీడీపీ పార్టీ పై నందమూరి వంశం ముద్ర పడకుండా ఉండేలా చేసేందుకు, తన తర్వాత పార్టీని లోకేష్‌కు అప్పగిం చేందు కు చంద్రబాబు ఆలోచిస్తున్నారనే విషయం అందరికీ తెలిసిందే. గతంలో ఈ విషయాన్ని అప్పటి అనంత పురం ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి బహిరంగంగానే సమర్ధించారు. గత ఏడాది జరిగిన ఎన్నికల్లో టీడీపీ కనుక విజయం సాధించి ఉంటే.. పార్టీ పగ్గాల మాట ఎలా ఉన్నా.. డిప్యూటీ సీఎం..పదవిని మాత్రం ఖచ్చి తంగా లోకేష్‌కు కట్టబెడతారని సీనియర్లు.. తమ ఇంటర్వ్యలలో చెప్పుకోచ్చారు.
అయితే, అదృష్టమో.. దురదృష్టమో.. టీడీపీ ఓడిపోయింది. ఇప్పుటికి ఏడాది పూర్తయింది. ఈ నేపథ్యంలో గత నెలలో జరిగిన పార్టీ మహానాడులో టీడీపీ అధినేత చంద్రబాబుకు కొందరు నాయకులు సూచనలు చే శారు. చిన్నబాబును జిల్లాల పర్యటనలకు పంపాలని వారు చెప్పారు. జిల్లాలపై పట్టు సాధిస్తే.. ము న్ముం దు చిన్నబాబుకు ప్రయోజనం ఉంటుందని, పార్టీలోనూ ఆయన అల్లుకు పోయేందుకు మరింత అవకాశం వచ్చినట్టు అవుతుందని వారు వివరించారు. అయితే, మహానాడు సమయంలో ఈ విషయంపై మౌనంగా ఉన్న చంద్రబాబు.. గడిచిన కొన్ని రోజులుగా ఈ విషయంపై దృష్టి పెట్టారని అంటున్నారు. ఇప్పటి నుంచి లోకేష్‌ను రెడీ చేయాలంటే.. జిల్లాల పర్యటన బెటర్ అనే అభిప్రాయానికి వచ్చినట్టు తాజా సమాచారం.
ఇటీవల తాడిపత్రి మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్‌రెడ్డి అరెస్టు అయినప్పుడు ఆజిల్లాకు వెళ్లిన నారా లోకేష్ కు జిల్లా నుంచి మంచి స్పందన వచ్చింది. అదేసమయంలో ఇటీవల అచ్చెన్నాయుడు అరెస్టు అయిన ప్పుడు ఆయన కుటుంబానికి ఓదార్చేందుకు శ్రీకాకుళం జిల్లాకు వెళ్లినప్పుడు కూడా లోకేష్‌కు మంచి రె స్పాన్స్ వచ్చింది. ప్రదానంగా యువత లోకేష్ పర్యటనలో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. పైగా ఆయనకు మద్దతుగా కూడా ఉన్నారు ఈ నేపథ్యంలో మున్ముందు.. లోకేష్‌ను జిల్లాలకు పంపడం ఉత్తమమని చంద్రబాబు భావిస్తున్నారట. ఇదే విషయాన్ని విజయవాడకు చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు ఒకరు కన్ఫర్మ్ చేశారు.
“మా పార్టీలో నెంబర్ 2 లోకేషే. మా అధినేత పార్టీ పగ్గాలను ఆయనకే ఇవ్వాలని ఎప్పటి నుంచో అనుకుం టున్నారు. దీనికి ముందుగానే ప్రజలతోనే లోకేష్‌కు జైకొట్టించి.. తర్వాత ఈ పదవిని అప్పగిస్తే.. తన నిర్ణయానికి కూడా ప్రజల ఆమోదం ఉందని భావించే అవకాశం ఉంటుంది. సో… వచ్చే రెండు మూడు నెలలలోనే లోకేష్.. (సీఎం జగన్ గ్రామాల పర్యటనకు కౌంటర్‌గా) జిల్లాల్లో పర్యటించి.. ప్రభుత్వ తప్పులను ఎత్తి చూపాలని నిర్ణయించారు. అయితే, దీనికి ఇంకా ముహూర్తం ఖరారు కావాల్సి ఉంది“-అని సదరు నాయకుడు చెప్పుకొచ్చారు. ఇదీ.. టీడీపీలో లోకేష్ జిల్లాల పర్యటన సారాంశం.