చంద్రబాబుకు షాక్..ఏపీలో ఇక బహిరంగ సభలు, ర్యాలీలు రద్దు !

-

తెలుగు దేశం పార్టీ అధినేత చంద్రబాబుకు షాక్ ఇచ్చారు సీఎం జగన్‌. ఏపీలో ఇక బహిరంగ సభలు, ర్యాలీలు నిర్వహించకుండా కీలక నిర్ణయం తీసుకుంది జగన్‌ సర్కార్‌. కందుకూరు, గుంటూరు సభల్లో విషాదాల తర్వాత, రాష్ట్రంలో రహదారులపై బహిరంగ సభలు, ర్యాలీలను నిషేధించింది జగన్‌ సరార్‌. జాతీయ రాష్ట్ర మున్సిపల్ పంచాయతీ రహదారులపై, అలాగే మార్జిన్లలో సభలు, ర్యాలీలకు అనుమతించేది లేదని తెలిపింది ప్రభుత్వం.

అయితే అత్యంత అరుదైన సందర్భాల్లో జిల్లా ఎస్పీలు, పోలీస్ కమిషనర్లు ఖచ్చితమైన షరతులతో అనుమతి ఇవ్వచ్చని మినహాయింపు ఇచ్చింది. రోడ్లపై బహిరంగ సభలు, ర్యాలీలతో ప్రజలకు అసౌకర్యం కలుగుతోందని, అలాగే నిర్వహణలో లోటుపాట్లు, నిర్వాహకుల నిర్లక్ష్యం ప్రజల ప్రాణాలను బలిగోంటున్నారని, అందుకే 30 పోలీస్ యాక్ట్ ను అమలు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. 1861 పోలీస్ చట్టం ప్రకారం హోం శాఖ ముఖ్య కార్యదర్శి హరీష్ కుమార్ గుప్తా ఉత్తర్వులు జారీ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news